ఖైదీ నంబర్ 150 తో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరంజీవికి ప్రేక్షకులు ఘనంగానే స్వాగతం పలికారు. తిరిగి పూర్వపు వైభవం తీసుకొచ్చారు. దాంతో చిరంజీవి రెట్టించిన ఉత్సాహం తో సినిమాలను చేయడం జరుగుతోంది .సైరా వంటి పిరియాడికల్ హిట్ మూవీ తరవాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక విభిన్న చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం తరవాత చేయ బోయే చిత్రాల వరుసలో పలువురు దిగ్దర్శకులు ఉన్నారు. వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
సంక్రాంతి కానుకగా వచ్చిన “అల వైకుంఠపురములో.” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రేంజ్ మారిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఇక త్రివిక్రమ్-చిరంజీవి కాంబో మూవీ ఎలా ఉండబోతోందనే విషయం లో కూడా ఒక వార్త బయటి కొచ్చింది.1983 లో చిరంజీవి నటించిన హిట్ చిత్రం మంత్రిగారి వియ్యంకుడు తరహాలు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా తీయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకొంటున్నట్టు తెలుస్తోంది. నిజానికి త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగ్స్, కామెడీ పంచ్ లతో నిండి ఉంటుంది.అలాంటి దర్శకుడు మెగాస్టార్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా తెరకెక్కించాలని ఉవిళ్లూరు తున్నాడు.అంటే.. మెగాభిమానులను మాటల మాంత్రికుడు.. కడుపుబ్బా నవ్వించబోతున్నాడన్న మాట.
చిరంజీవి అప్పుడెప్పుడో చంటాబ్బాయి,దొంగ మొగుడు వంటి సినిమాల చేసి ప్రేక్షకుల్ని అలరించాడు. మళ్ళీ ఆ స్థాయి కామెడీ చిత్రం కావాలని మెగా అభిమానులు కోరుకొంటున్నారు. అందుకే ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రం అనే సరికి చిరంజీవి కూడా త్రివిక్రమ్ కథకు ఒప్పుకున్నాడట. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ తో సినిమా తీయబోతున్నట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రకటించాడు. ఈ సినిమా పూర్తవ్వగానే చిరంజీవి తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ గ్యాప్ లో చిరంజీవికి కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా కూడా పూర్తవు తుంది.
A cake walk movie for All