Megastar Chiranjeevi : టాలీవుడ్ లో కమర్షియల్ సినిమా అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి, ఒకే మూస లో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పుంతలు తొక్కించిన హీరో ఆయన. డ్యాన్స్ మరియు ఫైట్స్ అంటే ఇలా ఉండాలి అని అందరికీ చూపించాడు, ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడిచారు , సక్సెస్ అయ్యారు.
ఈ ఏడాది ప్రారంభం లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఒక కమర్షియల్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో అందరూ చూసారు.ఇది కేవలం ఒక మామూలు మెగాస్టార్ కమర్షియల్ సినిమా మాత్రమే, కానీ కలెక్షన్స్ మాత్రం ఆల్ టైం టాప్ 5 రేంజ్ లో చేసింది. ఫుల్ రన్ లో 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆయన మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్’ అనే సినిమా చేసాడు , ఈ చిత్రం ఆగష్టు 11 వ తారీఖున విడుదల కాబోతుంది.
ఈ సినిమా తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా , వసిష్ఠ తో ఒక సినిమా ప్రారంభించాడు. వీటిల్లో ముందుగా కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం లో చిరంజీవి తో పాటుగా డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది.
అదేమిటి అంటే ఈ సినిమాలో విలన్ ఉండదట, ఫైట్స్ కూడా ఉండవట. పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. ఫైట్స్ లేని చిరంజీవి సినిమాని మనం ఊహించుకోలేము. మరి ఫ్యాన్స్ దీనిని ఎలా తీసుకుంటారో చూడాలి, ఈ చిత్రం లో చిరంజీవి కి జోడిగా త్రిష మరియు సిద్దు కి జోడిగా శ్రీలీల నటిస్తుంది. సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.