Mega-Superstar combination : సినిమా ఇండస్ట్రీలో కెరియర్ ను ఎక్కువ కాలంపాటు కొనసాగించాలంటే దానికి గట్స్ ఉండాలి. ఎలాంటి పరిస్థితునైన సరే ఎదుర్కొని నిలబడగలిగే తెగింపు ఉండాలి. అవి ఉన్నప్పుడే ఇండస్ట్రీలో మనుగడ ఈజీ అవుతోంది. తద్వారా సక్సెస్ లు సాధిస్తూ వాళ్ల కెరియర్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం దక్కుతోంది… మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. కాబట్టి ప్రస్తుతం స్టార్ హీరోలందరు పాన్ ఇండియా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలైతే పాన్ ఇండియా సినిమాల గురించి తప్ప మిగతా మూవీస్ గురించి పట్టించుకోవడం లేదు. అందుకే కథలను సైతం డిఫరెంట్ గా ఉండే విధంగా డిజైన్ చేసుకుంటున్నారు.
అలాగే ప్రతి ఒక్కరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆయన తండ్రి అయిన కృష్ణ గారి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెప్పించే హీరోగా మారాడు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి…
ఇక మహేష్ బాబు చేసిన ఆ రెండు సూపర్ హిట్ సినిమాల్లో మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్ కోసం మెగాస్టార్ చిరంజీవిని అడిగారు. కానీ ఆ రెండు పాత్రలను తను మిస్ చేసుకున్నాడు. కారణం ఏంటి అంటే ఒక సినిమాలో తన పాత్ర కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదని వదిలేస్తే మరొక సినిమాలోని కథ నచ్చినప్పటికి ఆయన బిజీగా ఉండడం వల్ల ఆ సినిమాని చేయలేకపోయారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే ఒకటి శ్రీమంతుడు కాగా, రెండవది భరత్ అనే నేను… ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.
రెండు సినిమాలకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఇక చిరంజీవి కనక ఆ పాత్రలను చేసి ఉంటే ఆయన కోసం ఆ క్యారెక్టర్స్ ని మరింత పెంచే వాళ్ళమని గతంలో కొరటాల శివ ఒక సందర్భంలో తెలియజేశాడు. మహేష్ బాబు – చిరంజీవి కాంబినేషన్లో రావాల్సిన రెండో సూపర్ హిట్ సినిమాలను మనం మిస్ అయిపోయాం…ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి…