Chiranjeevi Lossed: దర్శకుడు కొరటాల శివ చాలా కూల్. తన పని ఏదో తాను చేసుకుంటూ పోయే రకం. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరితో ఎలాంటి గొడవలు లేవు, ఒక్క బోయపాటితో తప్ప. అలాగే, కొరటాల శివ ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్.. ఒక్క ఆచార్య తప్ప. అందుకే, ఇండస్ట్రీలో కొరటాల శివకు ఇప్పటికీ మంచి పేరు ఉంది. ఇలాంటి నేపథ్యం ఉన్న ఒక డైరెక్టర్, సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో గొడవ పడ్డాడు అనగానే మొదట ఎవరూ నమ్మలేదు.

కొరటాల శివ చేసిన ‘ఆచార్య’ సినిమా విషయంలో ఇది జరిగింది. నిజానికి, ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే తనకు మ్యూజిక్ డైరెక్టర్ గా కావాలని కొరటాల మొదట పట్టుబట్టాడు. కానీ.. చిరంజీవి మాత్రం మణిశర్మనే కావాలని ‘ఆచార్య’ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. మొదట్లో కొరటాల – మణిశర్మ మధ్య మంచి అనుబంధమే ఉంది. ప్రెస్ మీట్స్ లోనూ ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో గౌరవం ఇచ్చి పుచ్చుకున్నారు.

కానీ, ‘ఆచార్య’ నేపథ్య సంగీతం విషయంలో ఇద్దరి మధ్య మొదలైన అభిప్రాయబేధాలు చివరకు కోల్డ్ వార్ వరకు వెళ్ళాయి. ఆచార్య సినిమా అసలు బాగాలేదు అని మొదట చిరంజీవికి చెప్పింది మణిశర్మనే. కొరటాల డైరెక్షన్ కూడా ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు అని మణిశర్మ చాలా కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ కొరటాల వరకు చేరాయి.

దాంతో.. కొరటాల నేపథ్య సంగీతం కూడా అసలు బాగాలేదు అంటూ.. కొరటాల చివర్లో దేవి చేత ఆచార్య నేపథ్య సంగీతం చేయించాలని చాలా ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే మణిశర్మ ఫోన్ కాల్స్ ను కొరటాల అవాయిడ్ చేశాడు. ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మాటలు లేని పొజిషన్ కి వెళ్ళింది పరిస్థితి. వీరి మధ్య ఉన్న గొడవల ప్రభావం ఆచార్య నేపథ్య సంగీతం పై బలంగా పడింది.

తన సినిమా కోసం మళ్ళీ వీరిద్దరిని కలపడానికి చిరంజీవి కూడా ప్రయత్నాలు చేశారు. చిరంజీవి కోసం వీళ్ళు తిరిగి మళ్ళీ కలిశారు. కానీ, కలిసిపోయి పని చేయలేదు. అందుకే.. ఆచార్య బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. మొత్తానికి ఆచార్య ప్లాప్ కి కొరటాల – మణిశర్మ గొడవ కూడా ఒక కారణమే. మొత్తమ్మీద వారిద్దర్నీ కలిపి చిరంజీవి చాలా నష్టపోయాడు. ఆచార్య నిర్మాణంలో చిరుకి సగం వాటా ఉంది.