Chiranjeevi : ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో చేస్తున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ఉగాది రోజున పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసారు. జూన్ నెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మెగాస్టార్ మార్క్ కామెడీ టైమింగ్ ని అభిమానులు రీ ఎంట్రీ తర్వాత బాగా మిస్ అవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లో కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ, అది మెగాస్టార్ కెపాసిటీ కి కేవలం 30 శాతం మాత్రమే. ఆయనలోని వంద శాతం కామెడీ టైమింగ్ ని బయటకు తీస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి. అనిల్ రావిపూడి ఇప్పుడు ఆ పని మీదనే ఉన్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా నయనతార(Nayanthara) ఎంపికైంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం లో అదితి రావు హైదరి నటిస్తుందని కొందరు, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తుందని మరికొందరు ప్రచారం చేశారు. కానీ చివరికి నయనతార అయితేనే ఈ సినిమాకు కరెక్ట్ అని చిరంజీవి చెప్పడం తో, అనిల్ రావిపూడి చెన్నై కి వెళ్లి ఆమెకు స్టోరీ ని వినిపించగా, ఆమె వెంటనే ఓకే చెప్పింది. కాకపోతే రెమ్యూనరేషన్ ఒక పది కోట్ల రూపాయిల రేంజ్ లో డిమాండ్ చేసింది. అందుకు నిర్మాతలు అంగీకరించారు. త్వరలోనే ఆమె సెట్స్ లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నయనతార సైరా నరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించింది. ఒక సినిమాలో చిరంజీవి కి జోడిగా నటిస్తే, మరో సినిమాలో చిరంజీవి కి చెల్లిగా నటించింది.
ఇకపోతే ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉంది. ఆ హీరోయిన్ రోల్ కోసం ‘సరైనోడు’ లో లేడీ ఎమ్మెల్యే క్యారక్టర్ చేసిన కేథరిన్ థెరిసా(Catherine Tresa) ఎంపిక అయ్యినట్టు సమాచారం. తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా , క్యారక్టర్ ఆర్టిస్టు గా నటించిన కేథరిన్, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ లో కూడా చేసింది. ఇందులో ఆమె మాస్ మహారాజ రవితేజ కి జోడిగా నటించాడు. కనిపించేది తక్కువసేపు అయినప్పటికీ కూడా మంచి నటన కనబర్చింది కేథరిన్ థెరిసా. త్వరలో తెరకెక్కబోతున్న అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ సినిమాలో ఆమెకు నటనకు అత్యంత ప్రాధాన్యత ఉండే పాత్ర దొరికిందట. త్వరలోనే హీరోయిన్స్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయనుంది మూవీ టీం. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించనున్నాడు. విక్టరీ వెంకటేష్ ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర కూడా చేయబోతున్నాడు.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?