
మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లలో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో తొలుత చిరుకు జోడీగా వెటరన్ బ్యూటీ త్రిష ఎంపికైంది. సినిమాలో షూటింగ్లో ఒకటి రెండ్రోజులు పాల్గొంది. అయితే ఆమె రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి త్రిష ఈ మూవీని తప్పుకున్నట్లు ప్రకటించింది. క్రియేటివ్ ఢిఫరెన్స్ వల్లే ‘ఆచార్య’ మూవీ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో త్రిష ఈ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించారు. త్రిష తప్పుకోవడంపై తాను యూనిట్ సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. ఆమెకు చిత్ర యూనిట్ సభ్యుల్లో ఎవరితోనూ క్రియేటివ్ డిఫరెన్స్ లేదని తెలిపారు. అదేవిధంగా ఎవరితో ఆమెతో గొడవలు లేవన్నారు. ఎలాంటి విభేదాలు లేకుండానే త్రిష ఈ మూవీ నుంచి తప్పుకుందన్నారు. మణిరత్నం మూవీకి త్రిష ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి వచ్చిందని ఆ కారణంతోనే ‘ఆచార్య’ నుంచి తప్పుకుందని చిరంజీవి పేర్కొన్నాడు.
త్రిష ‘ఆచార్య’ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ఎంపికైంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో కాజల్ అగర్వాల్ నటించింది. ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెల్సిందే. కాజల్ పనైపోయిందనుకునే సమయంలో అనుకోకుండా మెగాస్టార్ మూవీలో ఈ బ్యూటీకి ఆఫర్ దక్కించింది. త్రిష ఈ మూవీ నుంచి తప్పుకోవడం కాజల్ కు కలిసొచ్చింది. ఈ మూవీలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్లో మెరువనుంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. కరోనా పరిస్థితులు చక్కపడ్డాకే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.