Chiranjeevi Puri Jagannadh: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి…తన డ్యాన్స్, ఫైట్స్, నటనతో ప్రేక్షకులందరిలో ఉత్తేజాన్ని కలిగించిన నటుడు కూడా తనే కావడం విశేషం… ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో తనను బీట్ చేసే హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఇప్పటికి ఆయన మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు అంటే మామూలు విషయం కాదు. అందులో డాన్స్ లు, ఫైట్లు అలవొకగా చేస్తూ ప్రేక్షకులందరినీ అలరించాడు… అలాంటి చిరంజీవి కొంతమంది దర్శకులను సెలెక్ట్ చేసుకోవడంలో అప్పుడప్పుడు రాంగ్ స్టెప్స్ వేస్తూ ఉంటాడు. భోళా శంకర్ సినిమా విషయంలో మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చి ఆయన ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడు. ఆ సినిమా చేయడం వల్ల అతనికి ఒరిగిందేమీ లేదు..కానీ ఫలితంగా తన మార్కెట్ ని సైతం కోల్పోయాడు. అప్పటికే భారీ ఫ్లాప్ లను తీసిన మెహర్ రమేష్ కి ఏ ఒక్క హీరో అవకాశం ఇవ్వలేదు.
కానీ చిరంజీవి మాత్రం రీమేక్ సినిమానే కదా తను సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేయగలడు అనే నమ్మకంతో మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చినప్పటికి ఆయన దానిని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళలేకపోయాడు… ఇక పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు మాత్రం మెగాస్టార్ చిరంజీవికి చాలా సంవత్సరాల నుంచి కథలను వినిపిస్తున్నప్పటికి అతనికి సినిమా చేసే అవకాశం ఇవ్వడం లేదు…
మెహర్ రమేష్ కంటే పూరి జగన్నాధ్ చాలా బెటర్… చిరంజీవిని చాలా అద్భుతంగా చూపించగలడు. మరలాంటి పూరి జగన్నాధ్ ను పక్కన పెట్టి మెహర్ రమేష్ కి అవకాశం ఇవ్వడం ఎవ్వరికి నచ్చలేదు. ఈ విషయంలో పూరి జగన్నాథ్ అభిమానులతో పాటు కొంతమంది సగటు ప్రేక్షకులు సైతం చిరంజీవి మీద ఫైర్ అయ్యారు. నిజానికి చిరంజీవి పూరి జగన్నాథ్ కి అవకాశం ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే..పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేస్తాడో చిరంజీవికి క్లారిటీ లేకుండా పోయింది…
అందువల్లే చిరంజీవి ఆయన్ని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే పూరి జగన్నాధ్ తన ఎంటైర్ కెరియర్ లో ఒక్కసారైనా చిరంజీవిని డైరెక్ట్ చేయాలి అనేది తన కోరికగా పెట్టుకున్నాడు ఇప్పటివరకైతే అది వర్కౌట్ కాలేదు. ఇక ఫ్యూచర్లో ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది…