NTR-Chiranjeevi: ఎన్టీఆర్ ని బీట్ చేసిన చిరంజీవి మొదటి సినిమా… స్టార్ కాకముందే చిరు అద్భుత రికార్డు!

NTR-Chiranjeevi: ఎన్టీఆర్ తర్వాత అంతటి స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోగా చిరంజీవి చరిత్రకెక్కారు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ గా దాదాపు మూడు దశాబ్దాలు తిరుగులేని స్టార్డం తో ఏకఛత్రాధిపత్యం చేశారు. 1983లో విడుదలైన ఖైదీ మూవీతో స్టార్ గా ఎదిగిన చిరంజీవి… కెరీర్ బిగినింగ్ లో విలన్ తో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. అయితే హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ తో చిరంజీవి పోటీపడ్డారు. 1981లో ఎన్టీఆర్-చిరంజీవి సినిమాలు […]

Written By: Shiva, Updated On : January 7, 2022 1:51 pm
Follow us on

NTR-Chiranjeevi: ఎన్టీఆర్ తర్వాత అంతటి స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోగా చిరంజీవి చరిత్రకెక్కారు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ గా దాదాపు మూడు దశాబ్దాలు తిరుగులేని స్టార్డం తో ఏకఛత్రాధిపత్యం చేశారు. 1983లో విడుదలైన ఖైదీ మూవీతో స్టార్ గా ఎదిగిన చిరంజీవి… కెరీర్ బిగినింగ్ లో విలన్ తో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. అయితే హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే ఎన్టీఆర్ లాంటి స్టార్ తో చిరంజీవి పోటీపడ్డారు. 1981లో ఎన్టీఆర్-చిరంజీవి సినిమాలు ఒకే నెలలో విడుదల కాగా.. ఎన్టీఆర్ సినిమాను చిరంజీవి బీట్ చేశారు.

NTR-Chiranjeevi

ఖైదీ చిత్రానికి ముందు వరకు చిరంజీవికి స్టార్ డమ్ లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ అతిపెద్ద స్టార్స్ గా టాలీవుడ్ ని ఏలుతున్నారు. అదే సమయంలో చిరంజీవి హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా 1981లో ‘చట్టానికి కళ్ళు లేవు’ చిత్రం చేశారు. స్టార్ హీరో సూర్య తండ్రిగారైన చంద్రశేఖర్ ఈ మూవీకి డైరెక్టర్. తమిళ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. చట్టానికి కళ్ళు లేవు 1981 అక్టోబర్ 30న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అదే నెలలో ఎన్టీఆర్ కొండవీటి సింహం విడుదలైంది. అప్పటికే కే.రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. ఎన్టీఆర్-రాఘవేంద్రరావు లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకుంది. దీంతో భారీ అంచనాల మధ్య కొండవీటి సింహం విడుదలైంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా.. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి సాంగ్స్… ప్రేక్షకులను ఊపేశాయి.

Also Read: నానితో బెడ్ రూమ్ సన్నివేశం.. డైరెక్టర్ కి కృతి షాకింగ్ కండీషన్స్!

ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కొండవీటి సింహం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే అనూహ్యంగా చట్టానికి కళ్ళు లేవు మూవీ కొండవీటి సింహం చిత్రాన్ని బీట్ చేసింది. అక్టోబర్ 7న విడుదలైన కొండవీటి సింహం 100 రోజులు ప్రదర్శించబడగా… చట్టానికి కళ్ళు లేవు అక్టోబర్ 30న విడుదలై 107 రోజులు ప్రదర్శించబడింది. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో 100 రోజులు ఆడిన మొదటి చిత్రం చట్టానికి కళ్ళు లేవు కావడం విశేషం.

చిరంజీవి స్టార్ గా ఎదగడానికి పునాది చట్టానికి కళ్ళు లేవు తో పడింది. అలా స్టార్ డమ్ సాధించకుండానే ఎన్టీఆర్ లాంటి శిఖరాన్ని చిరంజీవి ఢీ కొట్టారు. ఖైదీ మూవీ విడుదలతో చిరంజీవి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పటికి ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీ కావడంతో పరిశ్రమను వదిలేశారు. చిరంజీవి ఎన్టీఆర్ స్థానం భర్తీ చేసి, తిరుగులేని స్టార్ గా నిలదొక్కుకున్నారు.

Also Read: అసలు ఈ ‘మా ఏపీ’ ఎన్నికల గోల ఏమిటో ?

Tags