Chiranjeevi Fan Emotional Letter: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూసి మెగా అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. సీనియర్ మెగా ఫ్యాన్స్ తాము కోరుకున్న ఒకప్పటి చిరంజీవి ఇప్పుడు వెండితెర పై కనిపించడం లేదు, ఒక్క డైరెక్టర్ కూడా వింటేజ్ చిరంజీవిని బయటకు తీసుకొని రాలేకపోయారని సినిమాలు చూడడమే మానేశారు. కొంతమంది చిరంజీవి మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక, అసంతృప్తి తోనే ఆయన సినిమాలు థియేటర్స్ కి వెళ్లి చూసేవాళ్ళు. కానీ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి లోని వింటేజ్ కామెడీ టైమింగ్, వింటేజ్ డ్యాన్స్, వింటేజ్ సెంటిమెంట్, ఇలా చిన్నప్పటి నుండి తాము చూస్తూ పెరిగిన చిరంజీవి ని మరోసారి బయటకు తీసుకొని రావడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చేలా చేసింది ఈ చిత్రం.
ఈ సందర్భంగా ఒక సీనియర్ మెగా ఫ్యాన్ సోషల్ మీడియా లో చిరంజీవి ని ఉద్దేశించి రాసిన ఒక బహిరంగ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఓ ప్రసాదు..అసలు నువ్వేమి చేసావో నీకైనా అర్థం అవుతుందా?, 7 పదుల వయస్సులో బీపీ, షుగర్, వాళ్ళు నొప్పులు అంటూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, X-రే లు, సీటీ స్కాన్ లు తీసుకునే మనుషులు ఉన్న ఈ రోజుల్లో, హుక్ స్టెప్పు అంటూ ఆ డ్యాన్స్ ఏంటి?, వీరోచితంగా ఆ ఫైట్స్ చేయడాలు ఏంటి?, నిన్ను ‘మన శనకర వరప్రసాద్ గారు’ చిత్రం లో చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు మా నాన్న టీవీలో నీ సినిమా చూస్తూ, నా భుజం మీద చరుస్తూ ‘ఒంట్లో స్ప్రింగులు ఉన్నోడే చిరంజీవి’ అని చెప్పిన రోజులు గుర్తుకు వచ్చాయి’ అంటూ ఎంతో ఎమోషనల్ గా ఈ లేఖ ని రాసాడు.
రెండు పేజీలు ఉన్నటువంటి ఆ లేఖకు సంబంధించిన ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. మెగా అభిమానులు అయితే ఈ లేఖని చూసి కంటతడి పెట్టుకోవడం తథ్యం. ప్రతీ మెగా అభిమాని మనసులో ఉన్న మాటలను ఈ లేఖ ద్వారా అతను చెప్పినట్టుగా అనిపించింది. ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం అతి త్వరలోనే 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది. మెగాస్టార్ కి ఇది మూడవ రెండు వందల కోట్ల గ్రాస్ సినిమా. గతంలో ఆయన హీరో గా నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇక ‘శంకర వరప్రసాద్ గారు’ ఊపు చూస్తుంటే 300 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
ఓయ్ ప్రసాదూ….. నిన్నే……@KChiruTweets @AnilRavipudi @Shine_Screens @GoldboxATL @sahugarapati7 @AlwaysRamCharan#ManaShankaraVaraPrasadGaru #MSVPG #Chiranjeevi #Megastar pic.twitter.com/RTb2dGdlMJ
— Ravindranath Sriraj (@ravindraraj11) January 14, 2026