No Heroine In Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..షూటింగ్ కార్యక్రమాలను ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు విడుదలకు మోక్షం దక్కించుకుంది..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కావడం తో ఈ మూవీ పై మెగా అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే తండ్రి కొడుకులను బాలన్స్ చేస్తూ కొరటాల శివ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ట్రైలర్ లో కూడా వీళ్లిద్దరు కలిసి కనిపించిన షాట్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ఆచార్య సినిమా గురించి జరుగుతున్న ఒక్క ప్రచారం పై డైరెక్టర్ కొరటాల శివ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది అనే విషయం మన అందరికి తెలిసిందే..కానీ సినిమాలో ఆమె పాత్రకి తగిన ప్రాధాన్యత లేకపోవడం , అంతే కాకుండా సినిమా ఫ్లో కి ఆమె పాత్ర అడ్డుకట్ట గా నిలవడం తో ఆమె పాత్రని తొలగించారు అనే వార్త గత కొద్దీ రోజుల నుండి ప్రచారం లో ఉంది..మూవీ ప్రొమోషన్స్ లో కానీ, ట్రైలర్ లో కానీ అసలు కాజల్ ఎక్కడా కనిపించకపోవడం తో,ఈ సినిమాలో అసలు కాజల్ అగర్వాల్ ఉందా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది..ఇదే విషయాన్నీ కొరటాల శివ గారిని ఇటీవలే అడగగా ఆయన మాట్లాడుతూ ‘వాస్తవానికి ఈ సినిమాలో చిరంజీవి పాత్రకి లవ్ ఇంట్రెస్ట్ ఉండదు..సినిమా అనుకున్నప్పుడు ఎదో హీరోయిన్ ఉండాలి కదా అని కాజల్ అగర్వాల్ గారిని తీసుకున్నాము..నాలుగు రోజులు ఆమెతో షూటింగ్ కూడా చేసాము..కానీ రషెస్ చూసినప్పుడు ఆమె పాత్ర సరదాగా ఉన్నప్పటికీ కూడా, ఎందుకో ఆమె పాత్రకి తగిన ప్రాధాన్యత రావడం లేదు..అంత పెద్ద స్టార్ హీరోయిన్ ని ఇలా ప్రాధాన్యత లేని ఒక్క పాత్ర కోసం తీసుకోవడం సరికాదు అనిపించింది..ఇదే విషయం ని ఆమెకి చెప్పగా..ఆమె కూడా అర్థం చేసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు.

అంటే ఇప్పుడు కాజల్ గారి మీద షూట్ చేసిన సన్నివేశాలు అన్ని సినిమా నుండి తొలగించారా అనే ప్రశ్నకి కొరటాల శివ సమాధానం చెప్తూ ‘ అవును ఆమెకి సంబంధించిన సన్నివేశాలు అన్ని తొలగించాము..కానీ లాహే లాహే సాంగ్ లో మాత్రం కచ్చితంగా ఉంటుంది.’ అంటూ చెప్పుకొచ్చారు కొరటాల శివ..ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి అంటే కమర్షియల్ కి పెట్టింది పేరు లాంటోడు..అలాంటి మెగాస్టార్ సినిమాలో, ఆయనకీ జోడి లేకపోతే ఫాన్స్ ఊరుకుంటారా అనేది ఇప్పుడు పెద్ద ఛాలెంజ్..కానీ ఇప్పుడు సగటు ప్రేక్షకుడు సినిమాని చూసే విధానం ని పూర్తిగా మార్చుకున్నాడు అని..సినిమాలో కంటెంట్ బలంగా ఉంటె హీరోయిన్ ఉందా, పాటలు ఉన్నాయా ఇలాంటివి ఏమి పట్టించుకోరు అని..దానికి ఉదాహరణగా ఇటీవల ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిలిచాయి అని..కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు అని కొరటాల శివ చెప్తున్నా మాట..మరి ఆయన మాట ఆచార్య సినిమా విషయం లో నిజం అవుతుందో లేదో తెలియాలి అంటే మరో మూడు రోజులు వేచి చూడాలి.
Recommended Videos: