https://oktelugu.com/

Chiranjeevi : చిరంజీవి ముందు ఆటిట్యూడ్ చూపించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

కానీ చిరంజీవి మాత్రం ఇంతకు ముందు జరిగినవేమి పట్టించుకోకుండా చాలా క్యాజువల్ గా ఆమె తో మాట్లాడుతూనే ముందుకు సాగాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి సక్సెస్ అవడానికి ఆయన టాలెంట్ తో పాటు, ఆయన వ్యక్తిత్వం కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి...

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2024 / 12:44 PM IST
    Follow us on

    Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీని 4 దశాబ్ధాల పాటు ఏలిన ఒకే ఒక్కడు చిరంజీవి. ఈయన నటించిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ గా కూడా కొనసాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. నిజానికి ఆయన చేసిన సినిమాలను ఇప్పటికి కూడా ఆరాధిస్తున్నారు అంటే అభిమానుల్లో ఆయన ఎంత మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా కష్టాలను అనుభవించి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు. కానీ అవన్నీ పట్టించుకోకుండా తన లక్ష్యం మీద ఫోకస్ చేసి ముందుకు కదిలాడు. ఇక ఇదిలా ఉంటే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి చేసిన ‘ ఖైదీ ‘ సినిమాలో హీరోయిన్ గా మాధవి నటించింది. ఈమె ఆ టైం లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. కానీ చిరంజీవి మాత్రం అప్పటికి మీడియం రేంజ్ హీరో గానే ఉన్నాడు. కాబట్టి చిరంజీవితో నటించేటప్పుడు ఆమె కొంచెం ఆటిట్యూడ్ చూపిస్తూ ఉండేదట.

    దాంతో చిరంజీవి కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయేవాడట. ఆమె ఆ సినిమా సమయం లో కొన్ని సందర్భాల్లో చిరంజీవితో చులకనగా కూడా మాట్లాడుతూ ఉండేదట. కానీ చిరంజీవి అవేమీ పట్టించుకోకుండా సినిమా చేసి ఆ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. ఇక దాంతో చిరంజీవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత చిరంజీవి మాధవి తో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆమె బిహేవియర్ మాత్రం చాలా చేంజ్ చేసుకొని వచ్చి చిరంజీవితో చాలా నీటుగా మాట్లాడుతూ చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించింది.

    కానీ చిరంజీవి మాత్రం ఇంతకు ముందు జరిగినవేమి పట్టించుకోకుండా చాలా క్యాజువల్ గా ఆమె తో మాట్లాడుతూనే ముందుకు సాగాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి సక్సెస్ అవడానికి ఆయన టాలెంట్ తో పాటు, ఆయన వ్యక్తిత్వం కూడా కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.