Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు బహుశా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎవరు చేయలేదనే చెప్పాలి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా ప్రేక్షకుడి హృదయంలో చోటు సంపాదించుకున్న ఏకైక హీరో. ఇక ఈయన ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేయాలి అనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు గా తెలుస్తుంది.
అయితే రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వచ్చినప్పటికీ ఆ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతం చిరంజీవి తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన నెల్సన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే టాక్ అయితే వస్తుంది. ఇక ఇప్పటికే నెల్సన్ రజినీకాంత్ తో జైలర్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా చిరంజీవిని కలిసి చిరంజీవికి కూడా ఒక కథ వినిపించినట్టుగా తెలుస్తుంది.
మరి నెల్సన్ చిరంజీవి కాంబినేషన్ అనేది చాలా రోజుల నుంచి వినిపిస్తున్నప్పటికీ దానిమీద క్లారిటీ అయితే రావడం లేదు దీంతో మరొకసారి ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెల్సన్ డైరెక్షన్ లో చిరంజీవి సినిమా చేస్తాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఈ సంవత్సరం సమ్మర్ నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే చిరంజీవి మాత్రం ఈ విషయం మీద స్పందించడం లేదు. ప్రస్తుతం ఆయన టార్గెట్ విశ్వంభర సినిమా మీదనే ఉన్నట్టు గా తెలుస్తుంది. ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోవడమే చిరంజీవి ముందు ఉన్న లక్ష్యం గా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడు అనేది…