https://oktelugu.com/

Chiranjeevi : ‘మళ్ళీ అమ్మాయి పుడుతుందేమో అని భయం వేస్తుంది’ అంటూ చిరంజీవి కామెంట్స్..అమ్మాయిలంటే అంత చులకన ఎందుకు?

చిరంజీవి(Megastar Chiranjeevi) స్థాయి వ్యక్తులు ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. వయస్సు ప్రభావం వల్లనో ఏమో తెలియదు కానీ, ఎందుకో ఈమధ్య చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎక్కువగా నోరు జారేస్తున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : February 12, 2025 / 08:48 AM IST
    Chiranjeevi

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi : చిరంజీవి(Megastar Chiranjeevi) స్థాయి వ్యక్తులు ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. వయస్సు ప్రభావం వల్లనో ఏమో తెలియదు కానీ, ఎందుకో ఈమధ్య చిరంజీవి పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎక్కువగా నోరు జారేస్తున్నాడు. కోట్లాది మంది అభిమానులకు ఆదర్శప్రాయంగా ఉండే చిరంజీవి నుండి మంచి మాటలే రావాలి కానీ, జనాలు మైండ్ సెట్ ని చెడగొట్టే వ్యాఖ్యలు రాకూడదు. దురదృష్టం కొద్దీ నిన్న ఆయన నోటి నుండి అలాంటి మాటలే వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే బ్రహ్మానందం(Bramhanandam) మరియు ఆయన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham) కలిసి నటించిన ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈవెంట్ మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం లోనే జరిగింది.

    కానీ చిరంజీవి అత్యుత్సాహంతో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారాయి. నెటిజెన్స్ తో పాటు అభిమానులు కూడా చిరంజీవి ని ఏకిపారేస్తున్నారు. దయచేసి కొన్ని రోజులు ఇలాంటి ఈవెంట్స్ కి దూరం గా ఉండాలంటూ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. విషయంలోకి వెళ్తే యాంకర్ సుమ(Anchor Suma) చిరంజీవి వద్దకు వెళ్లి క్లిన్ కారా వాళ్ళ తాత గారి ఫోటో చూపించండి అని అనగా, చిరంజీవి ఫోటో LED స్క్రీన్ లో చూపిస్తారు. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ ‘ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే. చరణ్(Ram Charan) ని ఒక్కోసారి అడుగుతుంటాను, దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా, మన లేజసీ ని ముందుకు కొనసాగించాలి అని. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది’ అంటూ చిరంజీవి నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

    దీనిని నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. అబ్బాయి పుట్టాలి అని కోరుకోవడం లో తప్పే లేదు, కానీ మీ లేజసీ ని అమ్మాయిలు కొనసాగించలేరని భావిస్తున్నారా..?, ఆడపిల్లలు అంటే అంత చులకన అయిపోయారా అంటూ చిరంజీవి ని తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజెన్స్. మెగాస్టార్ చిరంజీవి కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన కుటుంబం నుండి గ్లోబల్ స్టార్స్ ఉన్నారు. ఆయన తమ్ముడు స్వయానా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, చాలా ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, ఆడపిల్లలతో తమ కళలను సాకారం చేసుకోలేరు అనే అభిప్రాయం స్వయానా మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తి చెప్పడం ఎంత వరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇలా మాట్లాడి ఆయన అభిమానులకు ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు..?, చిరంజీవి సరదాగానే మీ మాటలు మాట్లాడి ఉండొచ్చు గాక, కానీ ఆయన నోటి నుండి ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం అభిమానులు ఊహించలేదు.