టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న వాల్యూ ఎంటో అందరికీ తెలుసు. 60 ప్లస్ దాటినా ఇప్పటికీ హీరోగా రాణిస్తున్న ఆయన కొడుకుతో కలిసి సినిమాల్లో నటిస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాక్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ అభిమానమే. సినిమా కథ ఎలా ఉన్న చిరంజీవి నటన ప్రేక్షకులు ఫిదా అవుతారు.అందుకే కొందరు నిర్మాతలు ఆయనతో ఒక్క సినిమా అయినా తీయాలని ఆరాటపడుతున్నారు. ప్రాణం ఖరీదు నుంచి మొన్నటి సైరా నర్సింహారెడ్డి వరకు చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు విజయవంతం అయ్యాయి. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా మెగాస్టార్ సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాయి. ఆయన నటించిన సినిమాల్లో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాల్లో కొన్నింటి గురించి..

సైరా నర్సింహరెడ్డి: హిస్టారికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి ప్రత్యేకంగా కనిపిస్తారు. చిరంజీవికి తోడుగా నయనతార, తమన్నాలు నటించారు. తెలంగాణ పోరాట యోధుడు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి కథా నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో 2019లో విడుదయింది. అయితే సినిమా నిర్మాణానికి, వచ్చిన రాబడికి భారీగా తేడా వచ్చింది.
ఖైదీ నెంబర్ 150: సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తరువాత రీ ఎంట్రీ ఇచ్చి చేసిన సినిమా ఇది. చిరంజీవి డబుల్ రోల్ లో నటించి మెప్పించారు. రైతుల సమస్యలను ప్రధానంగా తీసుకొని దీనిని నిర్మించారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రూ.104 కోట్లు రాబట్టింది. రీఎంట్రీతో చిరు మరోసారి తన సత్తా చూపించారు.
శంకర్ దాదా ఎంబీబీఎస్: హిందీలో విజయం సాధించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలను తెలుగులో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా కామెడీ ప్రధానంగా సాగంచిన బ్లాక్ బస్టర్ వద్ద విజయం సాధించింది. 2004లో విడులయిన ఈ సినిమా అప్పట్లో 26 కోట్ల బిజినెస్ చేసింది.
ఇంద్ర: ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మొదట్లో ప్లాప్ అని అన్నారు. కాన భారీ విజయం సాధించింది. చిరంజీవి కెరీర్ ను మరోసారి మలుపు తిప్పిన సినిమాగా చెబుతుంటారు. 2002లో విడుదలయిన ఈ సినిమా రూ.27 కోట్ల బిజినెస్ చేయడం విశేషం.
శంకర్ దాదా జిందాబాద్: శంకర్ దాదా ఎంబీబీఎస్ కు సీక్వెల్ గా తీసిన ఈ సినిమాలో చిరంజీవి కొత్తగా కనిపిస్తారు. సోషల్ ఫాంటసీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 26 కోట్లు రాబట్టింది.
స్టాలిన్: సామాజిక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో స్టాలిన్ ఆర్మీ అఫీసర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా ఆ సమయంలో 23 కోట్ల బిజినెస్ చేసింది. త్రిష, ఖుష్బూ లు నటించిన ఈ సినిమా ‘ముగ్గురికి సాయం చేసి.. మరో ముగ్గురి సాయం చేయాలి’ అనే నినాదం బాగా పాపులర్ అయింది.
ఠాగూర్: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడంపై తీసిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తమిళ సినిమా రీమేక్ అయినా తెలుగు నేటివిటికీ దగ్గర ఉండడంతో ఇక్కడి ప్రజలు ఆదరించారు. అంతేకాకుండా అప్పటి వరకు చిరంజీవి ఒక రకంగా ఈ సినిమాతో మరో రకంగా కనిపించారు. దీంతో ఈ సినిమా చిరంజీవి సినీ జీవితంలో బెస్ట్ మూవీగా చెప్పుకుంటారు. 2003లో విడుదలయిన ఈ సినిమా చిరంజీవి ఫర్ఫామెన్స్ కు అందరూ మెచ్చుకున్నారు. ఆ సమయంలో ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది.
జై చిరంజీవ: 2005లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నడిచినా రూ. 12 కోట్లు వసూలు చేసింది.