Mana Shankara Varaprasad: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో సినిమా అనగానే ఆడియన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో పెరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న చిత్రం, పైగా మెగాస్టార్ ని చాలా కాలం తర్వాత కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలో చూడబోతున్నాం అనే భరోసా అభిమానుల్లో రావడం వల్లే ఈ చిత్రానికి ఈ రేంజ్ రేంజ్ హైప్ ఏర్పడింది. దానికి తోడు విక్టరీ వెంకటేష్ కూడా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషిస్తుండడం కూడా ఈ సినిమాపై మరింత హైప్ పెరిగేందుకు కారణం అయ్యింది. అయితే నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ని ప్రకటించారు మేకర్స్. చిరంజీవి ఒరిజినల్ పేరు అయినటువంటి శివ శంకర వరప్రసాద్ టైటిల్ ని కాస్త మారుస్తూ ‘మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అని పెట్టారు.
Also Read: వింటేజ్ చిరంజీవిని చూపించిన అనిల్ రావిపూడి…బాస్ ఇస్ బ్యాక్…
ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఫ్యాన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ, చాలా కాలం తర్వాత చిరంజీవి ని ఇలా స్టైలిష్ లుక్ లో చూడడం వల్ల కాస్త డివైడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎందుకో గ్లింప్స్ లో చిరంజీవి నతురల్ లుక్స్ కనిపించలేదని,ఆయన డూప్ ని వాడినట్టుగా అనిపించిందని చాలా మంది దురాభిమానుల కామెంట్ చేశారు. ముఖ్యంగా నడిచే వచ్చే స్టైల్ వింటేజ్ మెగాస్టార్ ని ఇమిటేట్ చేసినట్టుగా అనిపించిందని ఈ గ్లింప్స్ చూసిన తర్వాత కొంతమంది అభిమానులకు అనిపించింది. వీటి అన్నిటితో పాటు ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో ఆ చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడిన మాటలు మరిన్ని అనుమానాలు కలిగించేలా చేసింది.
Also Read: చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలకు పవన్ కళ్యాణ్ దూరం..?
ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ఎలాంటి VFX ఉండదు,95 శాతం వరకు చిరంజీవి గారే నటించారు అని అంటాడు. అంటే మిగిలిన 5 శాతం దూప్స్ తో చిత్రీకరించారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ 5 శాతం లో ఈ గ్లింప్స్ వీడియో కూడా ఉందా అని అడుగుతున్నారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో చెప్పాడో తెలియదు కానీ, ఆయన మాట్లాడిన మాటలను బట్టీ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కూడా నటించబోతున్నాడని నేడు స్వయంగా అనిల్ రావిపూడి టైటిల్ గ్లింప్స్ లాంచ్ లో చెప్పుకొచ్చాడు. నిన్నటి తరం లో టాలీవుడ్ రికార్డ్స్ మొత్తం ఈ ఇద్దరి హీరోల చుట్టూనే తిరిగాయి. అలాంటి ఈ హీరోలు కలిసి ఇప్పుడు వెండితెర మీద కనిపిస్తే ఇక ఎలాంటి రికార్డ్స్ ఏర్పడుతాయో మీరే ఊహించుకోండి.