Chiranjeevi- Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇద్దరు ఉద్దండులు.. రికార్డులు బ్రేక్ చేసి..బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కొల్లగొట్టారు.. మాములుగానే వీరి సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లో సందడి ఉంటుంది. కానీ ఒకేసారి వీరి సినిమాలు పోటీ పడుతున్నాయి.. అదీ సంక్రాంతి బరిలో తలపడడం ఇండస్ట్రీ షేక్ అయ్యే విషయమే.. ఇప్పటికే ఫ్యాన్స్ సై..అంటే సై.. అంటున్నారు. మా హీరో గెలుస్తాడంటే.. మా హీరో గెలుస్తాడు.. అంటూ సోషల్ ‘వార్’ మొదలెట్టారు. అయితే వీరిలో ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా.. నిర్మాణ సంస్థకు మాత్రం లాభమే. ఒకవేళ రెండూ సక్సెస్ అయితే పంట పండినట్లే. ఈ తరుణంలో ఓ కొత్త చర్చ మొదలైంది. రెండు సినిమాలను ఒకే వేదికగా ప్రమోషన్ చేస్తే ఎలా ఉంటుంది..? ఇద్దరూ హీరోలు ఒక్కచోటికి వస్తే ఏం జరుగుతుంది..? మరి ఆ వేదిక ఎక్కడ..?

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ తరువాత చిరంజీవి చేస్తున్న ఈ మూవీ కూడా మరో హిట్ ఇస్తుందని ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ‘వీరయ్య’ కు చెందిన పోస్టర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కు నిద్రపట్టడం లేదు. ఊర మాస్ లుక్ లో ఉన్న చిరంజీవిని చూసి ఫిదా అయిపోయారు. ఒకప్పుడు ముఠామేస్త్రీలో కనిపించిన చిరంజీవి మళ్లీ అదే రేంజ్ లో కనిపించడంతో ఈ సినిమా బాక్సాపీస్ ను కొల్లగొడుతుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మెగాస్టార్ 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా 11 జనవరి 2023 రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు.
అటు డైలాగ్ కింగ్ నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చేస్తున్నాడు. ‘అఖండ’ విజయంతో అదే ఊపులో ఉన్న బాలయ్య మరో మాస్ మూవీకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా లుక్స్ కూడా ఫ్యాన్స్ ను కట్టిపడేశాయి. లుంగీ వేసుకొని బ్లాక్ షర్ట్ వేసుకున్న బాలయ్యను చూసి చూస్తే బ్లడ్ షేక్ అవుతోంది. ఫస్ట్ గ్లిమ్ష్ కూడా రిలీజ్ చేయడంతో సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదరుచూస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రంగా మేకింగ్ అవుతున్న ఈమూవీని ముందుగా డిసెంబర్లో అనుకున్నారు. కానీ బాలయ్య ఒత్తిడితో సంక్రాంతికి షిప్ట్ చేశారు.

ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇద్దరు ఉద్దండులు నటిస్తున్న ఈ సినిమాల లుక్స్ ఇప్పటికే పిచ్చెక్కిస్తున్నాయి. దీంతో సినిమాలపై హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. వీటి ప్రభావంతో కొన్ని సినిమాలను కూడా వాయిదా వేసుకున్నారు. అటు ఫ్యాన్స్ ఏ సినిమా గెలుస్తుందో తెలుసా..? అంటూ పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. ఇద్దరు బాక్సాపీస్ ను రికార్డులు బద్దలు కొట్టిన ఈ హీరోలు ఇప్పుడు ఎవరు షేక్ చేస్తారో చూడడానికి రెడీ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలపై కొత్త చర్చ మొదలైంది. వీటి ప్రమోషన్లను వేర్వేరుగా కాకుండా ఒకే వేదికపై నిర్వహిస్తే ఎలా ఉంటుంది..? అని ఆలోచిస్తున్నారు. అయితే అందుకు బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ 2’ వేదికను ఎంచుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య ఈ ప్రోగ్రాంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు హీరోలు తమ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ షోకు అటెండ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని ‘అన్ స్టాపబుల్ 2’ తీసుకొస్తే రెండు సినిమాలు ఒకేసారి ప్రమోషన్ చేసినట్లు అవుతుంది కదా..? అని మేకర్స్ ఆలోచిస్తున్నారు. అప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..