Chiranjeevi and Anil Ravipudi : ‘పటాస్’ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్ రావిపూడి (Anil Ravipudi) మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్ హీరోతో సైతం భారీ రేంజ్ లో సినిమాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూట్ ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు పాన్ ఇండియా బాటపడుతూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) మాత్రం ఇప్పటివరకు తెలుగు సినిమాలనే చేస్తూ మంచి సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. చిరంజీవి సినిమాతో పాన్ ఇండియాలో కూడా అడుగు పెట్టాలనే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలామంది హీరో, హీరోయిన్లు క్యామియో రోల్స్ పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది. అందులో విక్టరీ వెంకటేష్ (Venkatesh) మంచి క్యారెక్టర్ లో కనిపించి మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడట.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
నిజానికి వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నప్పటికి అనిల్ రావిపూడి తనకి వెంకటేష్ కి మధ్య ఉన్న మంచి బాండింగ్ వల్ల ఆయన ఒక క్యారెక్టర్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారట. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వెంకటేష్ 300 కోట్ల క్లబ్లో చేరిపోయాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే వెంకటేష్ లాంటి సీనియర్ హీరోని చిరంజీవి సినిమాలో వాడుకొని ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఒక వైబ్ ను క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించగలిగే కెపాసిటి అనిల్ రావిపూడి కి ఉందా? వరుసగా తొమ్మిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని త్రిబుల్ హ్యాట్రిక్ ను సాధిస్తాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…