Chiranjeevi-Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విషయం మనకు తెలిసిందే. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం..ఆయన కమర్షియల్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా జూన్ నెల నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా మీద ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు సెంటిమెంటల్ సీన్స్ కూడా ఉన్నాయట. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందంటూ చిరంజీవి అభిమానులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ సినిమాలో ఇద్దరు హీరోలు క్యామియో రోల్స్ పోషించబోతున్నారనే విషయమైతే చాలా క్లారిటీగా తెలుస్తోంది.
Also Read : జూ.ఎన్టీఆర్ కు ఇదే సపోర్టు ముందునుంచి ఇచ్చుంటే నందమూరి కథ వేరే ఉండేది?
అందులో ఒకరు వెంకటేష్ (Venkatesh) కాగా, మరొకరు కమల్ హాసన్(Kamal Hasan) అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి కమల్ హాసన్ కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా అయితే రాలేదు. అలాగే వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ లో కూడా సినిమా రాలేదు. అందువల్లే అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ని సెట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక అనిల్ రావిపూడి ఇంతకుముందు చేసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడంతో ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు. ఇక దాంతో పాటుగా ఆయన వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnaam) సినిమా భారీ విజయాన్ని సాధించడంతో వెంకటేష్ ని మూడు వందల కోట్ల మార్కెట్లో చేర్చాడు. మరి ఇప్పటివరకు ఏ సీనియర్ హీరో కూడా అంత గొప్ప కలెక్షన్స్ అయితే సాధించలేదు.
మరి ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సీనియర్ హీరోలందరికి చెక్ పెడుతూ 400 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు… చూడాలి మరి అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…