https://oktelugu.com/

Chiranjeevi-Venkatesh: అమెరికాలో సతీసమేతంగా చిరు, వెంకీ… అంత స్పెషల్ ఈవెంట్ ఏమిటో తెలుసా? ఫోటోలు వైరల్

కోనేరు కుమారుడు కిరణ్ వివాహం లాస్ ఏంజెల్స్ లో జరిగింది. ఈ పెళ్ళికి చిరంజీవి, సురేఖ హాజరయ్యారు. కుమార్ కోనేరు వెంకీ కి కూడా మిత్రుడు. దాంతో భార్య నీరజతో వెంకీ పెళ్లికి వెళ్లారు. చిరంజీవి, వెంకటేష్ సతీసమేతంగా ఫోటోలకు పోజిచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 19, 2024 / 12:41 PM IST
    Follow us on

    Chiranjeevi-Venkatesh: ఒకే జనరేషన్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ అమెరికాలో సందడి చేశారు. పెళ్లి వేడుకకు సతీసమేతంగా హాజరైన ఈ స్టార్స్ ఇద్దరు సేమ్ ఫ్రేమ్ లో పోజిచ్చారు. చిరంజీవి-వెంకీ కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే… చిరంజీవి తన మిత్రుడి కుమారుడు వివాహ వేడుకలో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. కోనేరు కుమార్ అనే ఎన్నారై లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యాడు. కుమార్ కోనేరు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు అని సమాచారం.

    కోనేరు కుమారుడు కిరణ్ వివాహం లాస్ ఏంజెల్స్ లో జరిగింది. ఈ పెళ్ళికి చిరంజీవి, సురేఖ హాజరయ్యారు. కుమార్ కోనేరు వెంకీ కి కూడా మిత్రుడు. దాంతో భార్య నీరజతో వెంకీ పెళ్లికి వెళ్లారు. చిరంజీవి, వెంకటేష్ సతీసమేతంగా ఫోటోలకు పోజిచ్చారు. ఈ వివాహానికి అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, నిర్మాత కే ఎల్ నారాయణ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సైతం హాజరయ్యారు.

    మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్ర షూటింగ్ కి స్వల్ప విరామం ప్రకటించి అమెరికా వెళ్లారు. విశ్వంభర సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో తెరకెక్కుతుంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభర భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. ఇటీవల షూటింగ్స్ లో కూడా జాయిన్ అయ్యింది.

    18 ఏళ్ల తర్వాత త్రిష-చిరంజీవి కలిసి చిత్రం చేస్తున్నారు. గతంలో వీరు స్టాలిన్ మూవీలో నటించారు. ఇక వెంకీ సంక్రాంతి కానుకగా సైంధవ్ విడుదల చేశారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సైంధవ్ ఆశించిన విజయం సాధించలేదు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు. సైంధవ్ వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కింది. వెంకీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించాల్సి ఉంది.