https://oktelugu.com/

Megastar Chiranjeevi: మెగాస్టార్ అంటే ఆ మాత్రం ఉంటది.. విమానంలో పెళ్లి రోజు జరుపుకున్న చిరు దంపతులు

చిరంజీవి కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకున్నారు. దివంగత కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోదరి సురేఖను ఆయన వివాహం చేసుకున్నారు. 1980 ఫిబ్రవరి 20న వీరి పెళ్లి జరిగింది.

Written By: , Updated On : February 20, 2025 / 06:08 PM IST
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi

Follow us on

Megastar Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత అంతటి ప్రజాభిమానం దక్కించుకున్న హీరో చిరంజీవి. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా నిలిచారు. ఆయనకు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. దాదాపు 40ఏళ్ల నటనా జీవితంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఆరంగేట్రం చేసే వాళ్లకు ఆయనే ఓ రోల్ మోడల్. ఇప్పుడిప్పుడే వస్తున్న నటీనటులంతా ఆయన కెరీర్లో ఏదో ఒక సందర్భాన్ని తమకు ఇన్సిపిరేషన్ గా తీసుకుంటారు. ఆయన కేవలం సినిమాలతోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొత్త వాళ్లను అవకాశాలు ఇవ్వడంతో పాటు.. సహ నటీనటులతో సత్సంబంధాలను కొనసాగిస్తూ ఇప్పటికీ ఓ ధృవతారగా వెలుగొందుతూనే ఉన్నారు.

చిరంజీవి కెరీర్ ప్రారంభంలోనే పెళ్లి చేసుకున్నారు. దివంగత కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోదరి సురేఖను ఆయన వివాహం చేసుకున్నారు. 1980 ఫిబ్రవరి 20న వీరి పెళ్లి జరిగింది. నేడు ఈ జంట తమ 45వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ అన్యోన్య దంప‌తులు త‌మ మ్యారేజీ యానివర్సరీని నేడు విమానంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. దుబాయ్ వెళ్తూ పెళ్లి రోజును ఇలా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలో అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌, మహేశ్ బాబు భార్య నమ్రత త‌దిత‌రులు ఆ విమానంలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు

ఈ క్రమంలో ఆయన ఈ విధంగా రాసుకొచ్చారు.. “దుబాయ్ మార్గమధ్యంలో కొంతమంది దగ్గరి స్నేహితులతో విమానంలో మా పెళ్లి రోజు జరుపుకున్నాం. సురేఖ నా భాగస్వామిగా లభించడం నా అదృష్టం. ఆమె నా కలల జీవిత భాగస్వామి. ఆమె నా బలం. ఆమె నా మోటివేట‌ర్‌. థ్యాంక్యూ. శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు! ఆశీర్వదించండి!” అంటూ చిరు పోస్ట్ పెట్టారు.

ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. విశ్వంభర దాదాపు షూటింగ్ పూర్తి అయినట్లే అని తెలుస్తుంది. ఇది కాక అనిల్ రావిపూడితో ఒకటి, వశిష్టతో మరో సినిమాలు లైన్లో ఉన్నాయి.