Rajinikanth and Chiranjeevi : చిరంజీవి(Chiranjeevi) ఇండస్ట్రీ కి ఎంతో సేవ చేశాడు. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ప్రతి సినిమా విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. అలాగే దర్శకులను ఎంపిక చేసే విషయంలో కూడా ఆయన చాలా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాడు మొత్తానికైతే చిరంజీవి లాంటి స్టార్ హీరోతో పని చేయాలని ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం అయితే లభించదు. కొంతమందికి మాత్రమే ఆయనతో సినిమాలు చేసే అవకాశం వస్తుంది. ఇక ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా గొప్ప గుర్తింపైతే ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవితో పాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న రజినీకాంత్ కూడా తెలుగులో మంచి ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు. మన తెలుగు హీరోలకి ఎలాంటి గుర్తింపు అయితే ఉంటుందో రజినీకాంత్(Rajinikanth) కి కూడా అలాంటి గుర్తింపు అయితే వచ్చింది. ఇక మనవాళ్లు అతన్ని ఓన్ చేసుకొని అతని సినిమాల కోసం ఎదురుచూడమే కాకుండా ఆయన సినిమా వస్తుందంటే మన స్టార్ హీరోలు సైతం భయపడే రేంజ్ కి ఆయన ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి రజనీకాంత్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికి తెలిసిందే.
మరి వీళ్ళిద్దరూ కలిసి కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో కూడా నటించారు.ఇక ఏది ఏమైనా కూడా రజినీకాంత్ కి చిరంజీవి నటించిన సినిమాల్లో ‘ఇంద్ర ‘(Indra) సినిమా అంటే చాలా ఇష్టమట. ఆ సినిమాలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లలో నటించడం తనకు చాలా బాగా అనిపించిందట.
ఆయన చేసిన భాషా సినిమా మాదిరిగానే ఇంద్ర సినిమా కూడా అదే స్క్రీన్ ప్లే తో సాగే ఈ సినిమాలో చిరంజీవి అద్భుతంగా నటించాడు. ఫ్యాక్షనిస్టుగా అదరగొట్టాడు అంటూ అప్పట్లో రజినీకాంత్ ఇంద్ర సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఇక అలాగే చిరంజీవి సినిమాల్లో ఆయనకు ఇంద్ర సినిమా ది బెస్ట్ సినిమా అంటూ ప్రశంసించడం గొప్ప విషయం. మరి ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు సైతం ఇప్పుడు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
ఇక రజనీకాంత్ అయితే జైలర్ 2 (Jailar 2) సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక చిరంజీవి సైతం విశ్వంభర అనే సినిమాతో సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చి మనల్ని మెప్పించడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…