Chiranjeevi and Rajasekhar : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకోవడం ఈజీనే, కానీ దానిని కాపాడుతూ ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు పాటు మనుగడను కొనసాగించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని…ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సినిమా తర్వాత ఆ హీరో మీద మరిన్ని అంచనాలు పెరగడమే కాకుండా ఇంతకుముందు వచ్చిన సక్సెస్ కంటే కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంటుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలను యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఒకప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు పండగ వాతావరణం ఉండేది. ఆయన అభిమానులు ఆయనకు భారీ కటౌట్లు కడుతూ, టికెట్ల కోసం క్యూ లో నిలబడి పడి రిస్క్ చేసి మరి ఆయన సినిమాలు చూసేవారు. చిరంజీవి అంటే ఆ రేంజ్ లో క్రేజ్ అయితే ఉండేది. మరి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి ఆయన కూడా ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవాడు… ఇలాంటి సమయంలోనే చిరంజీవికి రాజశేఖర్ కి మధ్య కొన్ని విభేదాలైతే తలెత్తాయి. రాజశేఖర్ సైతం మంచి సినిమాలను చేస్తూ నటుడిగా తనకంటూ ఒక వైవిధ్యాన్ని కనబర్చుకున్నాడు. అలాంటి రాజశేఖర్ తన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడమే కాకుండా చిరంజీవి తన కంటే స్టార్ హీరోగా ఎదిగాడనే ఒకే ఒక కారణంతో ఆయనతో తరచుగా విభేదాలు పెట్టుకునేవాడు. కానీ చిరంజీవి మాత్రం వాటిని లైట్ తీసుకునేవాడు. ఇక వీళ్లిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్స్ జరుగుతూనే ఉండేవి.
వాళ్ల మధ్య తరుచుగా చిన్న గొడవ జరగడం ఆ తర్వాత మళ్లీ కలిసి పోయి బాగా మాట్లాడుకునేవారు. చిరంజీవి దగ్గరికి వచ్చిన కొన్ని కథలను సైతం ఇవి రాజశేఖర్ కి అయితే బాగుంటాయని చెప్పి సజెస్ట్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. రాజశేఖర్ సైతం చిరంజీవి మీద గౌరవాన్ని చూపిస్తూ గొప్పగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read : మెగాస్టార్ చిరంజీవి కి అరుదైన పురస్కారం అందించిన లండన్ ప్రభుత్వం..దేశంలోనే మొట్టమొదటి భారతీయుడు!
ఇక ఏది ఏమైనా కూడా కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య మిస్ అండర్ స్టాండింగ్ జరగడం వల్లే వాళ్ళ మధ్య కొన్ని రోజుల పాటు మాటలు లేకుండా ఉన్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది…చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ జీవిత ఇద్దరు కూడా చిరంజీవిని భారీగా విమర్శించారు. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు చేసిన కామెంట్లలో నిజం లేదని గత సంవత్సరం ఒక తీర్పు కూడా వెలువడింది.
మొత్తానికైతే రాజశేఖర్ లాంటి నటుడు ప్రస్తుతం తన కెరీర్ ని పోగొట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే తన సినిమాల మీద దృష్టి పెట్టకుండా కాంట్రవర్సీల్లో నిలవడం వల్లే ఆయన కెరీర్ అనేది డౌన్ ఫాల్ అయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు…
Also Read : రాజశేఖర్, శంకర్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా అదేనా..? చేసుంటే పాన్ ఇండియన్ స్టార్ హీరో అయ్యేవాడు!