Chiranjeevi and Nagarjuna: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)ల ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వడంతో మేకర్స్ ఈ సినిమా ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అయితే, ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిలుగా రాబోతున్నారు.
నాగ చైతన్య సినిమాలకు నాగార్జున అతిథిగా రావడం సహజం, కానీ ఈ సారి మెగాస్టార్ గెస్ట్ గా రాబోతుండటంతో ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ‘లవ్ స్టోరీ’ మళ్ళీ జనాలను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఎలాగూ ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
పైగా నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తోన్న మొదటి సినిమా ఇది. అలాగే సాయి పల్లవితో చైతు చేస్తోన్న మొదటి సినిమా కూడా ఇది. అందుకే ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సాయి పల్లవి పై వచ్చిన సాంగ్ అదిరిపోయింది.
ఇక ‘ఫిదా’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ ఉంది. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇప్పటివరకు సూపర్ హిట్ సినిమా పడలేదు. ఈ ‘లవ్ స్టోరీ’ సినిమా ఆ రేంజ్ హిట్ సాధిస్తోందని అంచనాలు ఉన్నాయి.