Chiranjeevi-Mohan Babu: ఈ మధ్య టాలీవుడ్ తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిపోయింది. మా అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పటి నుంచే ఈ వివాదాలు రాజుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవికి, మోహన్ బాబు కుటుంబానికి మధ్య పెద్ద వారే నడుస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వంతో టికెట్ల రేట్ల అంశం కూడా పెద్ద దుమారమే రేపింది.
ఇన్ని వివాదాల నడుమ.. మొన్న జగన్‌తో చిరంజీవి టీమ్ వెళ్లి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా టికెట్ల రేట్ల సమస్యకు పరిష్కారం దొరికినట్టే అని తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. టాలీవుడ్‌లో అంటే ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయని, అలాంటిది ముగ్గురు హీరోలు, ఇద్దరు డైరెక్టర్లు వెళ్లడం ఏంటనే వాదనలు కొన్ని తెరమీదకు వచ్చాయి. అలాంటి వాటికి చెక్ పెడుతూ.. ఈ రోజు టాలీవుడ్ ప్రముఖుల సమావేశం నిర్వహిస్తున్నారు.
ఫిల్మ్ క్లబ్‌లో మార్నింగ్ 11గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. జగన్‌తో చిరంజీవి టీమ్ మాట్లాడిన విషయాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి ఫిల్మ్ ఛాంబర్ తో పాటు నిర్మాతల మండలి అలాగే మా అసోసియేషన్ ప్రతినిధులు దర్శకుల సంఘం లాంటి కీలక అసోసియేషన్లు ఇందులో పాల్గొంటాయి. దాదాపు 240 మంది సినీ ప్రముఖులు ఇందులో పాల్గొంటారని సమాచారం.
జగన్ తో మీటింగ్ కు ముందే దీన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఈ మీటింగ్ రెండు సార్లు వాయిదా పడింది. ఇక జగన్‌తో చర్చల తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కూడా ఇదే. ఇందులో సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ల రేట్లు, కార్మికుల సంక్షేమం లాంటి విషయాలపై మాట్లాడనున్నారు. ఈ మీటింగ్‌కు మంచు విష్ణుతో పాటు చిరంజీవి, మోహన్ బాబు లాంటి వారు కూడా వస్తున్నారు.
మోహన్ బాబు, చిరంజీవి ఒకే వేదికపైకి వస్తుండటంతో ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంతో వివాదాలకు పరిష్కారం దొరకుతుందా లేదా అన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. పైగా చిరంజీవి, మోహన్ బాబు ఈ మీటింగ్‌లో ఏమైనా పలకరించుకుంటారా అన్నది కూడా పెద్ద చర్చగా మారిపోయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Mohan Babu Son Of India Collections: ప్చ్.. 47 ఏళ్ల సినీ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాప్
Recommended Video: