Klin Kaara Konidela: చిరంజీవి, క్లింకార జాతకాలు కూడా ఒకటేనా? అసలేం జరుగబోతోందంటే?

రామ్ చరణ్ కు ఎన్నో సంవత్సరాల తర్వాత కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఈమె పేరు క్లింకార. అయితే మనవరాలి జాతకం, మెగాస్టార్ జాతకం సేమ్ టూ సేమ్ అంటూ టాక్.

Written By: Swathi, Updated On : February 13, 2024 12:32 pm

Klin Kaara Konidela

Follow us on

Klin Kaara Konidela: స్టార్ స్టార్ మెగాస్టార్.. చిరంజీవి మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి ఆయన. అయినా మెగాస్టార్ అంటే ఇంటి పేరు అనుకుంటున్నారా? 40 సంవత్సరాల నుంచి స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకున్న చిరంజీవి బిరుదు మెగాస్టార్. అయినా 40 సంవత్సరాల నుంచి స్టార్ స్టేటస్ ను కొనసాగించడం మామూలు విషయం కాదు. అసలు ఇండస్ట్రీలో కొనసాగడమే కష్టం. అలాంటిది ఇంకా స్టార్ హీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటారు చిరంజీవి.

ఈయన కెరీర్ అయిపోయిందని ఎన్నో సార్లు వార్తలు వచ్చినా తన మార్కెట్ తగ్గదనే విషయం నిరూపిస్తూ వస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లారు. అదే సమయంలో ఆయన సినిమాలు కూడా భారీ హిట్లను సాధిస్తూ సత్తా చాటారు. దీంతో మెగా అభిమానులు ఎప్పుడు సంతోషం వ్యక్తంచేస్తుంటారు. ఇక ఈయన వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ కూడా కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ కు ఎన్నో సంవత్సరాల తర్వాత కూతురు పుట్టిన విషయం తెలిసిందే. ఈమె పేరు క్లింకార. అయితే మనవరాలి జాతకం, మెగాస్టార్ జాతకం సేమ్ టూ సేమ్ అంటూ టాక్. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే మెగా ఫ్యామిలీ స్పందించాల్సిందే. అయితే చిరంజీవికి లక్ ఉందని.. ఆయన జాతకం మంచిగా ఉండడం వల్లనే ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు అని సమాచారం. ఇక ఇప్పటికీ కూడా స్టార్ హీరోల్లో ఈయన రెమ్యూనరేషనే టాప్. ఏకంగా రూ.60 కోట్లు సంపాదిస్తున్నారు.

క్లింకార పుట్టినప్పటి నుంచి ఈమె పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అయితే ఈమె కూడా చిరంజీవిలాగా చరిత్ర సృష్టించడం ఖాయం అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈమె నిజంగానే తాత లాంటి జాతకం కలిగి ఉందా? లేదా అనేది? ఇంతకీ మీరు ఎవరైనా క్లింకార ఫోటోలను చూశారా? ఇప్పటికీ మెగా వారసురాలి ఫోటోలను రివీల్ చేయలేదు మెగా ఫ్యామిలీ.. మరి ఈ సారి అయినా చూపిస్తారో లేదో చూడాలి.