Chinmayi: సింగర్ చిన్మయి కరుడుగట్టిన ఫెమినిస్ట్. గత ఐదారేళ్లుగా ఆమె రచయిత వైరముత్తుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వైరముత్తు పలువురు అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆమె ప్రధాన ఆరోపణ. వైరముత్తు మీద చిన్మయి కేసు కూడా పెట్టాడు. వైరముత్తుకు వ్యతిరేకంగా మాట్లాడిన చిన్మయి కోలీవుడ్ నుండి బహిష్కరణకు గురైంది. తరచుగా వైరముత్తు తప్పు చేసిన విషయం చిన్మయి సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది.
తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ వైరముత్తును కలిశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్వయంగా వైరముత్తు ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయన్ని అభినందించారు. ఈ క్రమంలో చిన్మయి ఫైర్ అయ్యారు. ఒక కామాంధుడు ఇంటికి స్వయంగా సీఎం వెళ్లి అభినందించడమా అంటూ సుదీర్థ సందేశం పోస్ట్ చేశారు.
పలువురు మహిళల చేత లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తి ఇంటికి సీఎం స్టాలిన్ స్వయంగా వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇతని బండారం బయటపెట్టినందుకు 2018 నుండి నేను కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను. కోలీవుడ్ నుండి బహిష్కరించబడ్డాను. ఒక సీఎం అతని ఇంటికి వెళ్లాడంటే ఆయన పలుకుబడి అర్థం చేసుకోవచ్చు. వైరముత్తుకు అంతటి బ్యాక్ గ్రౌడ్ ఉంది కాబట్టే మహిళలు అతడి అరాచకాలు బయటపెట్టేందుకు భయపడ్డారు.. అని తన సందేశంలో రాసుకొచ్చారు.
వైరముత్తుకు ఎలాంటి సన్మానం, సత్కారం, అవార్డు ప్రధానం జరిగినా సింగర్ చిన్మయి వ్యతిరేకిస్తారు. ఆ గౌరవాలకు అతడు అనర్హుడని ఆమె గట్టిగా నిలదీస్తారు. 2018లో సింగర్ చిన్మయితో పాటు మరికొందరు వైరముత్తు మీద లైంగిక ఆరోపణలు చేశారు. శారీక వాంఛలు తీర్చాలంటే వైరముత్తు మహిళను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సీరియస్ అలిగేషన్స్ చేశారు. ఇవ్వన్నీ నిరాధార ఆరోపణలు, తన ప్రతిష్ట దెబ్బతీసేందుకు చేస్తున్న ఆరోపణలు అని వైరముత్తు ఖండించారు. విచారణకు సిద్ధమంటూ ప్రకటించారు.
కాగా ఏ ఆర్ రెహమాన్ సిస్టర్ రెహానా మహిళల ఆరోపణలను సమర్ధించారు. చాలా కాలంగా అమ్మాయిలు వైరముత్తు చేత వేధింపులకు గురయ్యారనేది నిజం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైరముత్తుతో గొడవల అనంతరం చిన్మయికి ఆఫర్స్ లేకుండా పోయాయి. కోలీవుడ్ అనధికారికంగా ఆమెను బ్యాన్ చేసింది. ఇక తెలుగులో అనేక మంది హీరోయిన్స్ కి చిన్మయి డబ్బింగ్ చెప్పారు. సమంతకు కెరీర్ బిగినింగ్ నుండి ఆమె గొంతు అరువిచ్చారు. ఈ మధ్య సమంత సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటుంది.
The Chief Minister of Tamilnadu personally visits the home of a man accused by several women of sexual harassment to wish him on his birthday; I, as a multiple award winning singer and voice over artiste, face a work ban by the Tamil Film Industry since 2018, for naming this poet… https://t.co/8RpQ120swZ
— Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023