Childhood Photo : చాలామంది చిన్నప్పుడు బాల నటీనటులుగా తెలుగుతోపాటు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం ఇలా అన్ని భాషలలో కూడా నటించే చిన్నప్పుడే తమ కంటు ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. చిన్నప్పుడే ఫుల్ క్రేజ్ ఉన్న వాళ్ళు పెద్దయ్యాక కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ సాధించారు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో ఆకట్టుకొని ప్రేక్షకులకు ఇప్పటికీ కూడా బాగా గుర్తుండి పోయారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వాళ్లు ఆ తర్వాత చదువుల కోసం కొన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం వాళ్లు హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కూడా సాధించారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన వాళ్ళు చాలామంది ప్రస్తుతం హీరో హీరోయిన్లుగా సినిమాలలో తమ సత్తా చాటుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్న చాలామంది హీరో హీరోయిన్లు ఒకప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వారే. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ కూడా ప్రస్తుతం సినిమాలలో హీరో, హీరోయిన్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే బాల నటుడు కూడా ఒకప్పుడు తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇతని పేరు ఆనంద్ హర్షవర్ధన్.
అప్పట్లో ఆనంద్ హర్షవర్ధన్ బాల నటుడిగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సౌందర్య తో కలిసి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆనంద్ హర్షవర్ధన్ బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆనంద్ జగపతిబాబు, సౌందర్య, మహేశ్వరి ప్రధాన పాత్రలలో నటించిన ప్రియరాగాలు సినిమాలో హీరోయిన్ సౌందర్య కొడుకుగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమాలో కూడా వెంకటేష్, మీనాల కొడుకుగా నటించాడు.
ఇతను తెలుగులో ప్రముఖ కంపోజర్ మరియు ప్లే బ్యాక్ సింగర్ పీబి శ్రీనివాస్ మనవడు. బాల రామాయణం సినిమాలో ఆనంద్ హర్షవర్ధన్ వాల్మీకి, బాల హనుమాన్ పాత్రలలో కూడా నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆనంద్ హర్షవర్ధన్ హీరోగా జహాపనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఆనంద్ హర్షవర్ధన్ బాల నటుడిగా ప్రియరాగాలు, సూర్యవంశం, ప్రేమించుకుందాం రా, పెళ్లి పందిరి, మనసంతా నువ్వే, మావిడాకులు వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆనంద్ హర్షవర్ధన్ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు.
View this post on Instagram