నటీమణులకు సన్నబడటం అనేది ఈ మధ్య బాగా కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ‘కృష్ణదాసి’ సీరియల్ తో ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించిన ‘చవీ మిట్టల్’ కూడా అందరి భామలు లాగే బాగా సన్నబడింది. దీంతో ఆమె పై విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. అబ్ బాస్ అనే నెటిజన్ మరీ బక్కగా అయిపోయావ్ అంటూ ‘చవీ మిట్టల్’కే మెసేజ్ పెట్టింది.
అతని మెసేజ్ ఈ విధంగా సాగింది. ‘చవీ మిట్టల్ మీరేమనుకోవద్దు. ప్రస్తుతం మీరు బాగా బక్క చిక్కి పోయారు. ముఖ్యంగా మీ చేతులు చూస్తుంటే అవి అస్థిపంజరాల్లాగా ఉన్నాయి. మీ డైటింగ్ మరీ ఎక్కువైపోయింది. వృత్తిపరంగా నేనూ డాక్టర్ నే. నాకూ ఇద్దరు పిల్లలున్నారు. ఫిట్‌నెస్ మీద నేను కూడా బాగానే శ్రద్ధ వహిస్తాను. కానీ దయచేసి మీరు పాటించే డైట్ ను మాత్రం ఎవరికీ చెప్పొద్దు’ అంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది.
అయితే, నెటిజన్ పెట్టిన ఈ పోస్ట్ కి సదరు నెటిజన్ మీద చవీ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘డియర్ అబ్ బాస్, నేను కూడా మీకో విషయం చెబుతాను. ఒక అమ్మాయిగా సాటి అమ్మాయిని బాడీ షేమింగ్ చేయడం మంచి అనిపించుకోదు. దయచేసి ఇలాంటి మెసేజ్ లు చేయడం ఆపేయండి. మీకు తెలియదేమో.. నా పిల్లల కోసం, నా చుట్టూ ఉన్న వాళ్ల కోసం నా చేతులు ఎన్నాళ్ళ నుండో కష్టపడుతున్నాయి.
నా చేతులు పెద్ద వయసు వారి చేతుల్లా కనిపిస్తాయేమో. ఇది నిజమే కావొచ్చు, కానీ నా చేతుల ద్వారా చేసే మంచి పనులు ఎన్నో ఉన్నాయి. అవి నన్నెప్పుడూ సంతోషంగా ఉంచుతాయి. కాబట్టి, నేను ఎలా ఉన్నా సంతోషంగా ఉంటాను. ప్రియమైన తల్లులారా? నాలా మీరు కూడా బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నారా?’ అంటూ తిరిగి ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ.