Rashmika Mandanna : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన జంటగా నటించిన సినిమా ఛావా. పిరియాడిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక ముంబైలో చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన రష్మిక తన రిటైర్మెంట్ గురించి సరదాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రష్మిక మందన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో రష్మిక మాట్లాడుతూ ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసు బాయి గా నటించే అవకాశం నాకు రావడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. నాకు ఇంతకుమించి ఒక నటిగా ఇంకేం కావాలి. నేను సంతోషంగా ఈ సినిమా తర్వాత రిటైర్ అవ్వగలను అని ఒక సందర్భంలో రష్మిక దర్శకుడితో చెప్పారట. దాంతో ఇది అంత గొప్ప పాత్ర అని అర్థమవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు రష్మిక భావోద్వేగానికి గురైనట్లు తెలిపారు. ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఎమోషనల్ అయిన రష్మిక. ఈ సినిమాలో హీరో విక్కీ కౌశల్ నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ నన్ను సంప్రదించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పేశాను. ఈ సినిమాలోని ఈ పాత్ర కోసం చాలాసార్లు రిహార్సల్స్ చేశాను. ఈ సినిమా టీం మొత్తం నాకు ఎంతో సహకరించింది. ఈ సినిమాలోని పాత్రలు అన్నీ అందరిని ప్రభావితం చేస్తాయి అని హీరోయిన్ రష్మిక తెలిపారు.
దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసు బాయిగా కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ అయిన ఛావా సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ ట్రైలర్ లో సింహం లేకుండా ఉండొచ్చు కానీ.. ఆ సింహానికి పుట్టిన ఛావా ఇంకా బతికే ఉంది. మరాఠాలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్ని లేకుండా చేస్తాం అంటూ వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. జిమ్లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో రష్మిక మందన కాలికి గాయమైంది.
ఇక తాజాగా ముంబైలో జరిగిన ఛావా ట్రైలర్ రిలీజ్ వేడుకకు ఆమె గాయంతోనే వెళ్లడం జరిగింది. రష్మిక వేదిక మీదకు వెళ్లడానికి విక్కీ కౌశల్ సాయం చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. రష్మిక నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది.ఎవరు ఊహించని రేంజ్ లో వసూళ్లు సాధించి పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.