https://oktelugu.com/

83 Movie: చిక్కుల్లో పడ్డ రణ్‏వీర్ సింగ్ 83 సినిమా… చీటింగ్ కేసు నమోదు

83 Movie: ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “1983”. టీమిండియా మాజీ సారథి, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో రణ్‏వీర్ సింగ్ నటిస్తున్నారు. క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 02:09 PM IST
    Follow us on

    83 Movie: ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “1983”. టీమిండియా మాజీ సారథి, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో రణ్‏వీర్ సింగ్ నటిస్తున్నారు. క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 30న విడుదలైన ఈ మూవీ ట్రైలర్‏కు విశేష స్పందన లభించింది. కాగా దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది.

    cheating case files on bollywood star ranveer singh 83 movie

    Also Read: “పుష్ప”లోని “ఊ అంటావా… ఊహు అంటావా” సాంగ్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్…

    ఈ సినిమా నిర్మాతలు చీటింగ్ చేశారంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ కంపెనీ ఫిర్యాదు చేసింది. అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది.. ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టే ఆలోచనతో నిర్మాతలను కలిశారు. సినిమా హక్కులు ఇస్తామని చెప్పి రూ. 15.90 కోట్లు ఖర్చు చేయించారని… తీరా ఇప్పుడు చూస్తే సినిమా హక్కుల విషయంలో తాను మోసపోయానని కోర్టును ఆశ్రయించారు. 83 సినిమా నిర్మాతలపై ఐపీసీ 406, 420, 120బీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. విబ్రి మీడియా డైరెక్టర్ పై భారతీయ శిక్షాస్మృతి లోని 406, 420, 120బి సెక్షన్ల కింద చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సినిమాలో సునీల్ గవాస్కర్ పాత్రలో తాహిర్ రాజ్ బాసిన్, కృష్ణమాచార్య శ్రీకాంత్‏గా జీవా, మదన్ లాల్ పాత్రలో హార్డీ సందు, మహీంద్రనాథ్ అమర్ నాథ్ పాత్రలో సకీబ్ సలీమ్ నటించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో రూపొందించారు.

    Also Read: లక్ష్య రివ్యూ