Chatrapathi Chandrashekar:సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరో , హీరోయిన్లు కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకుంటారు. వారికి కేటాయించిన పాత్రలకు న్యాయం చేస్తూసినిమా విజయానికి కారణం అవుతారు. కొన్ని సినిమాల్లో ఈ ఆర్టిస్టులు తప్పనిసరిగా ఉంటారు. ముఖ్యంగా కొందరు డైరెక్టర్లు వారిని తీసుకోకుండా సినిమా తీయరనే చెప్పొచ్చు. అలా ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తన సినిమాల్లో కొందరిని తప్పకుండా చూపిస్తారు. అలాంటి వారిలో చంద్రశేఖర్ ఒకరు. చంద్రశేఖర్ అని అనడం కంటే ఛత్రపతి ఛంద్రశేఖర్ అంటే అందరూ గుర్తుపడుతారు. ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ‘భద్రం’ పాత్రలో నటించి మెప్పించారు. అయితే చంద్రశేఖర్ భార్య కూడా నటీనే అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె ఎవరంటే?
రాజమౌళి సినిమాల్లో చంద్రశేఖర్ తప్పనిసరిగా ఉంటాడు. సినిమాలో చంద్రశేఖర్ అవసరం లేకున్నా ఆయన కోసం పాత్రను సృష్టిస్తారు. అయన అంటేఅభిమానమో లేదో తెలియదు గానీ నాటి సింహాద్రి నుంచి నేటి బాహుబలి వరకు ప్రతీ సినిమాలో కనిపిస్తాడు. అయితే చంద్రశేఖర్ ముందుగా సీరియళ్లలో కనిపించి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోనటిస్తున్న సమయంలోనే చంద్రశేఖర్.. నీల్య భవాని అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే వీరిద్దరు కలిసి ఎప్పుడూ కనిపించలేదు. కానీ నీల్య భవాని మాత్రం పలు సినిమాల్లో నటించి మెప్పించారు. పండుగ చేస్కో, సైరా, నాని జెంటిల్ మెన్ లాంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. తనకు కేటాయించిన పాత్రకు ఆమె న్యాయం చేశారు. అయితే నీల్య భవాని ఫలానా అని తెలిస్తే తప్ప గుర్తు పట్టరు. చాలా సార్లు ఆమెను చూసినా.. ఆమె చంద్రశేఖర్ భార్య అని తెలియక ఎవరూ పట్టించుకోలేదు.
ఎంతో అందంగా ఉన్న నీల్య భవాని ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కనిస్తూ ఉంటారు. అయితే ఈమెకు చంద్రశేఖర్ కుమధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో వీరు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే సినిమాల్లో మాత్రం ఎవరికి వారే నటిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చంద్రశేఖర్ ఉంటాడా? లేదా? అనేది చూడాలి.