Chathuram OTT: ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఓటీటీల రాకతో కొత్త పుంతలు తొక్కుతోంది. మూవీ లవర్స్ కి అన్ లిమిటెడ్ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి పండగే అని చెప్పాలి. లెక్కకు మించిన సినిమాలు, సిరీస్లు వివిధ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కంటెంట్ ని ప్రాంతీయ భాషల్లో ప్రేక్షకులకు అందజేస్తున్నారు. ఇతర భాషల్లో ఆదరణ పొందిన సినిమాలు, సిరీస్లు మన భాషలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఓటీటీ పుణ్యమా అని మలయాళ చిత్రాలకు మరింత డిమాండ్ పెరిగింది. తక్కువ బడ్జెట్ లో విన్నూతమైన కంటెంట్ ఇవ్వడంలో మలయాళ పరిశ్రమ ముందుంది. థియేట్రికల్ రిలీజ్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆదరణ దక్కకపోతే నష్టాలు చవి చూడాలి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వలన మలయాళంలో తెరకెక్కిన చిన్న చిత్రాలు ఇతర భాషల ప్రేక్షకులకు చేరుతున్నాయి.
కాగా ఓ మలయాళ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఆ మూవీ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. వయసు మళ్ళిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి భర్తను మట్టుబెట్టాలని చూస్తుంది. అందుకు ప్రియుడి సహాయం కోరుతుంది. అడుగడునా మలుపులతో ఆసక్తికరంగా ఈ చిత్రం సాగుతుంది.
కథ విషయానికి వస్తే… బాగా డబ్బున్న ఓ వృద్ధుడు రెండో భార్యగా యువతిని తెచ్చుకుంటాడు. ఆ వృద్ధుడితో కాపురం చేయడం ఆ యువతికి ఇష్టం ఉండదు. ఆ వృద్ధుడు ఆమెను కొట్టి టార్చర్ చేస్తుంటాడు. ముసలి భర్త పీడను ఎలాగైనా వదిలించుకోవాలి అనుకుంటుంది ఆమె. ఒకరోజు కొండ మీద నుంచి తోసేస్తుంది. కానీ గాయాలతో బయటపడతాడు.
నడవలేని స్థితిలో ఉన్న భర్తకు వైద్యం అందించేందుకు రోజూ ఒక నర్స్ ఇంటికి వస్తుంటాడు. ఆ నర్స్ తో వృద్ధుడి భార్య ఎఫైర్ పెట్టుకుంటుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడుతుంది. భర్తను చంపేందుకు అతడి సహాయం కోరుతుంది. తర్వాత ఏమైంది? అనేది కథ.
ఈ చిత్రం పేరు చతురం. 2022లో విడుదలైంది. చతురం చిత్రానికి సిద్ధార్థ్ భరతన్ దర్శకుడు. శ్వాసిక, రోషన్ మాథ్యూ, అలెన్సీయర్ ప్రధాన పాత్రలు చేశారు. చతురం చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ సైనా ప్లే లో చూడవచ్చు.
Web Title: Chathuram ott release review in telugu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com