చారు-రాజీవ్ విడిపోవడం లేదని క్లారిటీ వచ్చినట్టేగా?

కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో ఓ సెలబ్రెటీ జంట విడిపోతున్నట్లు వరుస కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈనేపథ్యంలో సదరు బాలీవుడ్ జంట సోషల్ మీడియా మీడియా వేదిక ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకోవడం ఆసక్తిని రేపుతోంది. వీరిద్దరు కూడా తమపై వస్తున్న పుకార్లు చెక్ పెట్టేందుకే ఇలా చేశారా? లేదా నిజంగా కలిసిపోయారా? అనేది బీ టౌన్లో చర్చనీయాంశంగా మారింది. Also Read : కరోనాలో కూడా చైతు ‘లవ్ స్టోరీ’ మొదలైంది !  ఆ ప్రముఖ బాలీవుడ్ జంట ఎవరో కాదు.. హీరోయిన్ […]

Written By: NARESH, Updated On : September 7, 2020 11:49 am

charu raajeev

Follow us on

కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో ఓ సెలబ్రెటీ జంట విడిపోతున్నట్లు వరుస కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఈనేపథ్యంలో సదరు బాలీవుడ్ జంట సోషల్ మీడియా మీడియా వేదిక ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకోవడం ఆసక్తిని రేపుతోంది. వీరిద్దరు కూడా తమపై వస్తున్న పుకార్లు చెక్ పెట్టేందుకే ఇలా చేశారా? లేదా నిజంగా కలిసిపోయారా? అనేది బీ టౌన్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : కరోనాలో కూడా చైతు ‘లవ్ స్టోరీ’ మొదలైంది ! 

ఆ ప్రముఖ బాలీవుడ్ జంట ఎవరో కాదు.. హీరోయిన్ చారు అపోస, ప్రముఖ మోడల్ రాజీవ్ సేన్. వీరిద్దరు గతేడాది క్రితం గోవాలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. రాజీవ్ సేన్ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి సుస్మిత సేన్ సోదరుడు. ఇక చారు అపోస రెండు హిందీ సినిమాల్లో నటించడంతోపాటు బుల్లితెరపై నటిస్తోంది. వీరిద్దరి పెళ్లి కొద్దిమంది సన్నిహితుల సమక్షంగా గతేడాది వైభవంగా జరిగింది.

అయితే ఇటీవల వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరి వైవాహిక జీవితం సాఫీగా జరగడం లేదని బాలీవుడ్లో వర్గాల్లో విన్పించింది. రాజీవ్ సేన్, చారు అపోసలు వారి సోషల్ మీడియాల అకౌంట్స్ నుంచి తాము కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడం.. ఒకరినొకరు అన్ ఫాల్లో చేసుకోవడంతోనే వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరింది.

ఈనేపథ్యంలోనే వారిద్దరు సోషల్ మీడియా వేదికగానే తమపై వచ్చిన పుకార్లు సమాధానం చెప్పారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రేమను చాటుకున్నారు. రాజీవ్ సేన్ ‘కలిసి ఉండటం ఎంతో ఆనందం కలిగిస్తుంది.. నా భార్యను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను’ అని పోస్టు పెట్టాడు. దీనిపై స్పందించిన చారు అపోస ‘నిన్ను బాగా మిస్ అవుతున్నాను’ అంటూ ఓ రోమాంటిక్ ఫోటోను పోస్టు చేసింది. ఇలా వీరిద్దరు తమపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. దీంతో ప్రస్తుతానికి వారిద్దరు కలిసే ఉన్నారనే క్లారిటీ మాత్రం వచ్చింది.

Also Read : ప్రభాస్.. 100కోట్ల రెమ్యూనరేషన్లో నిజమెంత?