Homeఎంటర్టైన్మెంట్EMK Promo: ఎన్టీఆర్ ప్రశ్నకు చరణ్ టెన్షన్.. ప్రోమో అదిరింది !

EMK Promo: ఎన్టీఆర్ ప్రశ్నకు చరణ్ టెన్షన్.. ప్రోమో అదిరింది !

Evaru Meelo Koteswarulu

ఎన్టీఆర్ ‘బిగ్ బాస్ 1’తో తెలుగు బుల్లితెరకు టీఆర్పీ సునామీని పరిచయం చేశాడు. మళ్ళీ బుల్లితెర పై అలాంటి వెలుగులు జిమ్మడానికి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ మొదటి ఎపిసోడ్ లోనే రామ్ చరణ్ తో దర్శనమివ్వబోతున్నాడు. జెమినీ టీవీలో ఆగస్టు 22, రాత్రి 8:30 నుంచి ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమోను వదిలారు మేకర్స్.

ప్రోమోలో ఎన్టీఆర్ – చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. షోలోకి రావడంతోనే చరణ్ హోస్ట్‌ సీట్‌లో కూర్చోవడానికి వెళ్తుండగా.. వెంటనే ఎన్టీఆర్ అలెర్ట్ అవుతూ… ‘అది హాట్‌ సీటు‌.. ఇది హోస్ట్‌ సీటు’ అంటూ చెప్పిన విధానం, ఆ సమయంలో చరణ్ ఎక్స్ ప్రెషన్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇక చరణ్‌ వెళ్లి హాట్‌ సీటులో కూర్చొన్న అనంతరం ఇద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణలు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయి.

ముఖ్యంగా చరణ్.. ‘మిమ్మల్ని కొన్ని ప్రశ్నలను అడగాలనుకుంటున్నాను’ అంటూ ఎన్టీఆర్ వైపు నర్మగర్భంగా చూడటం, దానికి ఎన్టీఆర్ ‘బాబోయ్ నీకు దణ్ణం పెట్టేస్తాను, అవి ఇక్కడ వద్దు’ అనడం, చరణ్ కూడా ‘డన్, ఆ ప్రశ్నలు ఇక్కడ ఎందుకు లేండి’ అంటూ కామ్ అవ్వడం సందడిగా అనిపించింది. అయితే చరణ్ అడగాలనుకున్న ప్రశ్నలు.. ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి సంబంధించి అని టాక్.

ఇక ప్రోమో చివర్లో ఎన్టీఆర్‌ వేసిన ప్రశ్నకు చరణ్ టెన్షన్ ఫీల్ అవుతూ.. ‘సీటు హీట్‌ ఎక్కుతోంది.. బ్రెయిన్‌ కూడా హీట్‌ ఎక్కుతోంది’ అని తల పై వేళ్ళు పెట్టి నొక్కుకోవడం, ఆ సమయంలో ఎన్టీఆర్, చరణ్ వైపే చూస్తూ ఉండటం.. మొత్తానికి ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం అలరించడం ఖాయంలా కనిపిస్తోంది.

పైగా ఎన్టీఆర్ – చరణ్ మొదటిసారి బుల్లితెర పై స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి ఈ ఎపిసోడ్‌ మొత్తాన్ని చూడాలంటే ఆగస్టు 22వ తేదీ వరకూ ఆగాల్సిందే. అన్నట్టు ఈ ఎపిసోడ్‌ లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ముచ్చట్లుతో పాటు రాజమౌళి గురించి చర్చ కూడా ఉంటుందట. ఇక ఈ ఎపిసోడ్‌ కి కనివిని ఎరగని టీఆర్పీ వచ్చే అవకాశం ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular