Karthik Subbaraj: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది అని ఎనౌన్స్ చేసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఒక పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ ఫైనల్ కావాలి అంటే.. కనీసం ఏడాది పడుతుంది. కానీ, శంకర్ ఇండియన్ 2 గోలలో ఉన్నాడు. మరి చరణ్ తో చేస్తున్న పాన్ ఇండియా సినిమా స్క్రిప్ట్ ను ఎప్పుడు రాశాడు ? ఈ అనుమానం నెటిజన్లతో పాటు ఇండస్ట్రీ జనాల్లో కూడా ఉంది.

అయితే, చరణ్ – శంకర్ సినిమా స్క్రిప్ట్ గురించి తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ తెలిసింది. శంకర్ – రామ్ చరణ్ సినిమాలో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ కూడా భాగమయ్యారు. కార్తిక్ చెప్పిన పొలిటికల్ కథ డైరెక్టర్ శంకర్‌కు నచ్చడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని, ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వంగా ఉందని డైరెక్టర్ కార్తిక్ వెల్లడించారు. అయితే కార్తిక్ కథ ఇవ్వగా చిత్రానికి దర్శకత్వం శంకర్ చూసుకుంటున్నారు. అంటే.. కార్తీక్ ఇచ్చిన కథతో శంకర్.. చరణ్ తో సినిమా చేస్తున్నాడు అన్నమాట.
Also Read: రోజుకు నాలుగు జీడిపప్పులు తింటే ఆ సమస్యలకు చెక్.. ఊహించని బెనిఫిట్స్?
ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి 10 నుంచి 28వ తేదీ వరకు రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో జరగనుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ ఏపీలో ప్లాన్ చేశారు. ఇక ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ లో రామ్ చరణ్ పై ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరించనున్నారని.. ఈ సీన్స్ లో కియరా అద్వానీ కూడా పాల్గొన బోతుంది అని తెలుస్తోంది.

ఇక రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. ఐఏఎస్ అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది. నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింతగా రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు. అందుకే..
అన్నట్టు మార్చి 2 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ లాంగ్ ఫైట్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ తో పాటు సోనూసూద్ కూడా ఈ ఫైట్ లో జాయిన్ కానున్నాడు.
Also Read: రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయం చేసిన భీకర విలన్స్ ఎవరెవరో తెలుసా?
[…] Also Read: చరణ్ – శంకర్ సినిమాకి కథ ఇచ్చింది ఆ స్… […]