https://oktelugu.com/

Charan Rajamouli and Tarak: చరణ్‌ పానిపూరి, రాజమౌళి బిర్యానీ.. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఏమిటి ?

Charan Rajamouli and Tarak: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ను అద్భుతంగా ప్రమోట్ చేశారు. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు అలియా భట్ కూడా ప్రమోషన్స్ కోసం ఎక్కువ డేట్లు ఇచ్చి పని చేశారు. కానీ సినిమా పోస్ట్ ఫోన్ అయింది. అయితే, ప్రమోషన్స్ కోసం చేసిన ఇంటర్వ్యూలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 6, 2022 / 11:10 AM IST
    Follow us on

    Charan Rajamouli and Tarak: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ను అద్భుతంగా ప్రమోట్ చేశారు. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. ఎన్టీఆర్, చరణ్ లతో పాటు అలియా భట్ కూడా ప్రమోషన్స్ కోసం ఎక్కువ డేట్లు ఇచ్చి పని చేశారు. కానీ సినిమా పోస్ట్ ఫోన్ అయింది. అయితే, ప్రమోషన్స్ కోసం చేసిన ఇంటర్వ్యూలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

    Charan Rajamouli and Tarak

    ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్‌.. బాలీవుడ్‌ నటి సాహెబా బాలీతో ఓ వంట షో చేశాడు. ఆ వంట ప్రోగ్రామ్ లో ‘సాహెబా బాలీ’కి తారక్ హైదరాబాదీ బిర్యానీతోపాటు పలు పసందైన వంటకాల గురించి చెబుతూ.. ఆ వంటకాల మధురమైన రుచిని ఆమెకు పరిచయం చేశాడు. అయితే, ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య కొన్ని ఆసక్తికర చర్చలు జరిగాయి.

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ లో వారిని వంటలతో పోలిస్తే.. ఎవరిని ఏ వంటతో పోలుస్తారు అంటూ సాహెబా బాలీ, ఎన్టీఆర్ ని అడిగింది. ఇక ఎన్టీఆర్, ముందుగా రాజమౌళిని బిర్యానీతో పోల్చాడు. బిర్యానీ చేయాలంటే అన్నీ పర్‌ఫెక్ట్‌ గా ఉండాలి. చాలా కష్టపడాలి. జక్కన్న కూడా చూడటానికి సింపుల్‌ గా ఉన్నా పని విషయంలో చాలా పర్‌ఫెక్ట్‌ గా ఉంటాడు’ అని తారక్ తెలిపాడు.

    ఇక రామ్‌ చరణ్‌ ను పానిపూరితో పోల్చాడు ఎన్టీఆర్. పానిపూరి నోట్లో వేసుకోగానే దానిలోని ఫ్లేవర్స్‌ తెలిసిపోతాయి. అలాగే చరణ్‌ తో మాట కలపగానే తాను ఏమిటో తెలిసిపోతుంది. తను అన్ని విషయాలూ పంచుకుంటాడు’ అన్నాడు. ఆలియా భట్‌ విషయానికి వస్తే.. ఆమె ఇరానీ బన్‌ మస్కాతో పోల్చాడు ఎన్టీఆర్. కారణం.. ఇరానీ బన్‌ మస్కా ఎంతో ఆరోగ్యకరమైంది. చాలా ప్రత్యేకమైంది అట. కాబట్టి ఆలియా భట్‌ కూడా చాలా మంచిది అని తారక్ ఉద్దేశ్యం.

    Also Read: ఇప్పుడు రాజమౌళికి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ అదే !

    చివరగా అజయ్‌ దేవ్‌గణ్‌ ను వడా పావ్‌ తో పోల్చాడు. ముంబయి లోకల్‌ ఫుడ్‌ అయినా వడా పావ్‌ అక్కడ ప్రజలకు కచ్చితంగా ఉండాల్సిందే. అంటే అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా వడా పావ్‌ లా అందరికీ కావాల్సినవాడని తారక్ అభిప్రాయం. ఏది ఏమైనా ఎన్టీఆర్ చాలా తెలివిగా సమాధానాలు చెప్పాడు. తారక్ సమాధానాలు హిందీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి.

    అందుకే, ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు హిందీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే, చరణ్‌ పానిపూరి, రాజమౌళి బిర్యానీ, అజయ్ వడా పాప్, అలియా ఇరానీ బన్‌ మస్కా… ఇలా అందరికి వంటలు బాగా సెట్ అయ్యాయి. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఏమిటి ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: ఆ సినిమా కోసం 10 లక్షల మంది అభిమానులు వచ్చారన్న తారక్ … ఏ మూవీ అంటే ?

    Tags