Characters of Gaami : ప్రభాస్ కి ఓ సినిమా టీజర్ విపరీతంగా నచ్చేసిందట. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ పోస్ట్ వైరల్ అవుతుంది. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా గామి టైటిల్ తో ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్ర టీజర్ ఫిబ్రవరి 17న విడుదల చేశారు. విశ్వక్ సేన్ ఒక విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నాడు. టీజర్ సస్పెన్సు అంశాలతో కూడుకుని ఉంది. విజువల్స్ ఆకట్టుకున్నాయి.
ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన టీజర్ అంచనాలు పెంచేసింది. గామి టీజర్ చూసిన ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీజర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను… అని కామెంట్ చేశారు. ప్రభాస్ గామి టీజర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తో పాటు గామి చిత్ర యూనిట్ ప్రభాస్ కి కృతజ్ఞతలు చెప్పారు. ప్రభాస్ సోషల్ మీడియా పోస్ట్ తో గామి చిత్రానికి మంచి ప్రచారం దక్కింది.
కాగా గామి చిత్ర ట్రైలర్ ఫిబ్రవరి 29న విడుదల కానుంది. గామి చిత్రానికి విద్యాధర కాగిత దర్శకత్వం వహిస్తున్నాడు. చాందిని చౌదరి కీలక పాత్రలో నటించింది. వి సెల్యులాయిడ్స్ ప్రజెంట్ చేస్తుండగా.. కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. గామి చిత్రానికి నరేష్ కుమరన్ సంగీతం అందిస్తున్నారు. గామి త్వరలో విడుదల కానుంది. ఈ మూవీ కోసం చాలా కష్టపడినట్లు విశ్వక్ సేన్ చెప్పుకొస్తున్నారు.
మరోవైపు విశ్వక్ సేన్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 2020 లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ తర్వాత విశ్వక్ సేన్ కి సక్సెస్ లేదు. ఆయన గత చిత్రం దాస్ కా ధమ్కీ ని స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించారు. అయితే దాస్ కా ధమ్కీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. గామి విడుదల సిద్ధం అవుతుండగా… గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ తో మరో మాస్ విలేజ్ డ్రామా చేస్తున్నారు. అలాగే 10వ చిత్రం ప్రకటించారు.
A darling sized boost to the young team of #Gaami ❤️🔥
Rebel Star #Prabhas Garu appreciated the teaser of #Gaami and calls it EXTRAORDINARY 🌟
Characters of #Gaami Teaser Trending #1 on Youtube 💥
– https://t.co/9u7O9Duee7Theatrical trailer on February 29th 💥
Grand release… pic.twitter.com/WozmYhDniN
— UV Creations (@UV_Creations) February 18, 2024