Homeఎంటర్టైన్మెంట్Pragathi: పెళ్లి నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం... విడాకుల మేటర్ పై నోరు విప్పిన ప్రగతి

Pragathi: పెళ్లి నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం… విడాకుల మేటర్ పై నోరు విప్పిన ప్రగతి

Pragathi: స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తెలియనివారంటూ ఉండరు. అమ్మ, అత్త పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్. ఎమోషనల్ సన్నివేశాల్లో అలరించే ప్రగతి కామెడీ అలవోకగా పండించగలరు. ఎఫ్ 2 మూవీలో ప్రగతి కామెడీ టైమింగ్ ఎవరూ మర్చిపోరు. సిల్వర్ స్క్రీన్ పై ఎనర్జిటిక్ గా కనిపించే ప్రగతి వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు. ఏళ్లుగా ఇద్దరు పిల్లల బాధ్యత విజయంతంగా నెరవేరుస్తున్నారు. ఇక పెళ్లి తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయంగా ప్రగతి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Pragathi
Pragathi

హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్న సమయంలో కాస్ట్యూమ్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక సినిమాలు వదిలేశారు. రైన్ సాంగ్ లో ట్రాన్సపరెంట్ డ్రెస్ ధరించాల్సి ఉండగా అది ఇష్టం లేక ప్రగతి చేయనని చెప్పేశారట. పెళ్లి చేసుకోవడం జీవితంలో తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా ప్రగతి అభివర్ణించారు. ప్రగతి మాట్లాడుతూ… సంసారం జీవితంలో చాలా కాంప్రమైజ్ అయ్యాను. ఒక దశకు వచ్చాక తట్టుకోలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాను.

భర్తతో విడాకుల అనంతరం ఇద్దరు పిల్లలతో బయటికి వచ్చేశాను. ఉన్న నగలు అమ్మి సింగిల్ బెడ్ రూమ్ ఇంటికి షిఫ్ట్ అయ్యాను. చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియని సమయంలో ఒక నిర్మాత ఫోన్ చేసి సీరియల్ ఆఫర్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన రూ. 10 వేల చెక్ చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది. ఎంత సంపాదించినా ఆ చెక్ నాకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది. ఇప్పుడు నా పిల్లల వయసు అబ్బాయికి 20 అమ్మాయికి 14. మా ముగ్గురిదే ప్రపంచం. ఎలాంటి నిర్ణయం అయినా ముగ్గురం కలిసే తీసుకుంటాము. నన్ను అర్థం చేసుకునే పిల్లలు పుట్టడం నా అదృష్టం.

Pragathi
Pragathi

లాక్ డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. షూటింగ్స్ లేకపోవడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఆ సమయంలో నగలు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, ప్రగతి చెప్పుకొచ్చారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. ఆ కారణంగానే లేడీ బాస్ ఫీలింగ్ కలిగిందని ప్రగతి వెల్లడించారు. ఒంగోలుకు చెందిన ప్రగతి 1994లో ఒక తమిళ చిత్రంతో హీరోయిన్ అయ్యారు. వరుసగా 7 చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. మహేష్ బాబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version