Chandramukhi 2 OTT: చంద్రముఖి – 2 ఓటీటీ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్‌ అంటే..

తమిళ అగ్ర నటుడు రజనీకాంత్‌ హీరోగా, జ్యోతిక హీరోయిన్‌గా నటించిన చంద్రముఖిలో నాందా చంద్రముఖి అంటూ జ్యోతిక, లక లక లక అంటూ రజినీకాంత్‌ ప్రేక్షకులను భయపెట్టారు.

Written By: Raj Shekar, Updated On : October 5, 2023 11:56 am

Chandramukhi 2 OTT

Follow us on

Chandramukhi 2 OTT: లక లక లక అంటూ అందర్నీ భయపెట్టిన చంద్రముఖి సినిమాకు 17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌ ఇటీవల రిలీజ్‌ అయింది. చంద్రముఖి 2గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రముఖి అంత సూపర్‌ హిట్‌ టాక్‌ రాకపోయినా.. పరవాలేదు అన్నట్లుగా థియేటర్లలో ఆడుతోంది. ఈ క్రమంలో చంద్రముఖి – 2 ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తున్న నెటిజన్లకు సినిమా ప్రొడ్యూసర్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పారు. త్వరలో ఓటీటీ విడుదలకు అంతా సిద్ధమౌతోంది.

భయపెట్టని సీక్వెల్‌..
తమిళ అగ్ర నటుడు రజనీకాంత్‌ హీరోగా, జ్యోతిక హీరోయిన్‌గా నటించిన చంద్రముఖిలో నాందా చంద్రముఖి అంటూ జ్యోతిక, లక లక లక అంటూ రజినీకాంత్‌ ప్రేక్షకులను భయపెట్టారు. తమ నటనతో నెక్ట్స్‌ లెవల్‌ అనిపించారు. అయితే దానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి–2 మాత్రం అంతగా భయపెట్టలేకపోతోంది. బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేక చతికిలపడుతోంది.

17 ఏళ్ల తర్వాత సీక్వెల్‌..
చంద్రముఖి నాడు ఎంతగా భయపెట్టిందో, ఎంతటి సెన్సేషనల్‌ హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. 17 ఏళ్ల తరువాత దర్శకుడు పి వాసు సీక్వెల్‌ చంద్రముఖి 2 తెరకెక్కించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ హీరోగా, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా నటించారు. సెప్టెంబర్‌ 28న విడుదలైన చంద్రముఖి 2 ఎందుకో అంతగా మెప్పించలేకపోయింది. కొత్తదనం లేదనే విమర్శలకు తోడు లారెన్స్‌ నటన తేలిపోయిందంటున్నారు. రజనీకాంత్‌ స్థానంలో లారెన్స్‌ ఆకట్టుకోలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ప్రభావం చూపించలేకపోతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో..
ఇక సినిమా ప్లాప్‌ టాక్‌ రాగానే నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. దీపం ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అన్నట్లుల.. థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీ డేట్స్‌ ప్రకటిస్తున్నారు. తాజాగా చంద్రముఖి–2 ఓటీటీ డేట్‌ కూడా నిర్మాతలు ప్రకటించారు. ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఇందుకు రూ.8 కోట్లు చెల్లించినట్లు సమాచాం. ఒప్పందం ప్రకారం విడుదలైన 45 రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు లారెన్స్‌ భారీగా పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఏకంగా రూ.25 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది. ఇంకా సీనియర్ నటీ నటులు చాలామంది చంద్రముఖి 2లో నటించారు.