https://oktelugu.com/

బాబే ఒప్పేసుకుంటున్నాడు

ఏపీలో డిసెంబర్‌‌ 25 నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే అధికారిక ప్రకటన జారీ చేశారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాద్దాంతం చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. అంత తక్కువ స్థలం ఇస్తే ప్రజలేం చేసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. ఏపీ సర్కారు ఫ్రీగా స్థలం ఇస్తోందని చెప్పకనే చెబుతున్నారు. Also Read: హుందాతనం కోల్పోతున్న ఏపీ అసెంబ్లీ.. నేతల తీరే […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 2, 2020 / 01:28 PM IST
    Follow us on


    ఏపీలో డిసెంబర్‌‌ 25 నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే అధికారిక ప్రకటన జారీ చేశారు. అయితే దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాద్దాంతం చేస్తుండడం ఆశ్చర్యంగా ఉంది. అంత తక్కువ స్థలం ఇస్తే ప్రజలేం చేసుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్న ఆయన.. ఏపీ సర్కారు ఫ్రీగా స్థలం ఇస్తోందని చెప్పకనే చెబుతున్నారు.

    Also Read: హుందాతనం కోల్పోతున్న ఏపీ అసెంబ్లీ.. నేతల తీరే కారణమా?

    చంద్రబాబు ఇవ్వలేదు

    చంద్రబాబు హయాంలో ఎక్కడా ఎవరికీ ఉచితంగా ఇళ్ల స్థలం ఇవ్వలేదు, కట్టిన అపార్ట్ మెంట్లకు కూడా బ్యాంకు లోన్ ముడిపెట్టారు. అంతేకాదు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని ఆరోపణ కూడా ఉన్నది. ప్రస్తుతం అసెంబ్లీలో ఇళ్ల స్థలాలు, టిడ్కో అపార్ట్ మెంట్లపై అనవసర రాద్ధాంతం చేసి తన బండారం అంతా తానే బయట పెట్టుకున్నారు.

    అంతా ఫ్రీగా ఇవ్వాలి

    300 గజాల విస్తీర్ణం ఉన్న అపార్ట్ మెంట్లను మాత్రమే ఉచితంగా ఇస్తామంటున్నారని, విస్తీర్ణంతో సంబంధం లేకుండా అన్ని ఇళ్లనూ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా అపార్ట్ మెంట్లను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంటే తన హయాంలో ఐదేళ్లలో ఏం చేయలేదనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఒప్పేసుకున్నట్లైంది.

    Also Read: హాట్ టాపిక్.. జాతీయగీతం మారబోతుందా?

    ఇండ్లపై మీడియాలో ప్రచారం

    జగన్‌ మోహన్‌ రెడ్డి ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇస్తుండడంపై మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చేయలేని పనులు జగన్ చేసి చూపిస్తున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక వైసీపీ సోషల్‌ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. బాబు ఓ ఆట ఆడుకుంటున్నారునుకోండి..!

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్