Champion Movie First Review: ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్… తను ఒకప్పుడు హీరోగా రాణించాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటిస్తూ విలన్ గా మెప్పిస్తున్నాడు. అలాంటి శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతూ నిర్మల కాన్వెంట్, పెళ్లి సందడి అనే సినిమాలు చేశాడు. ఆ సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు మరోసారి ఆయన ఛాంపియన్ అనే ఒక సినిమాని చేస్తున్నాడు. ఇక వైజయంతి బ్యానర్ మీద ఈ సినిమాను స్వప్న దత్ నిర్మించడం విశేషం…ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో లను ఇండస్ట్రీలో ఉన్న పలువురు సినిమా పెద్దలకైతే వేశారు. వాళ్లు ఈ సినిమాను చూసి ఎలా రియాక్ట్ అయ్యారు. దాన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఫుట్ బాల్ గేమ్ అంటే అమితంగా ఇష్టం ఉండే రోషన్ ఫుట్ బాల్ ఆడడానికి ఏం చేశాడు. బ్రిటీషర్స్ ని ఎలా ఎదిరించాడు తన ప్రేమని గెలుచుకోవడానికి ఎలాంటి ఉద్యమం చేశాడు. తను నమ్ముకున్న ఫుట్ బాల్ ను ఆసరాగా ఆయన ఎలాంటి స్కెచ్ లు వేశాడు. ఫైనల్ గా తన ప్రేమను గెలుచుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే…
ఇక దర్శకుడు ప్రదీప్ అద్వైతం సైతం ఈ సినిమాని కంప్లీట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తూనే ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఎలివేషన్స్ ఇచ్చాడు. ప్రతి సీను ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది… ముఖ్యంగా సినిమా ఫస్టాఫ్ లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఫుట్ బాల్ గేమ్ మీద వచ్చే ఎలివేషన్స్ బాగుంటాయి. హీరో పర్ఫెక్ట్ ఫుట్బాల్ ప్లేయర్ గా కనిపించాడు… ఇక సెకండాఫ్ లో వచ్చే లవ్ సీన్స్ ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. అలాగే మదర్ అండ్ సన్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అప్పుడు హీరో వేసిన ఎత్తులు ఏంటి? హీరో ప్రణాళికలు చేసి ఎలా ఢీ కొట్టాడు అనేది కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది… ఇక ఇప్పటికే మిక్కీ జే మియర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇప్పటికే ఒక సాంగ్ ప్రేక్షకులందరిని మెప్పించడంతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయింది.
అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా మిక్కీ జే మేయర్ ఎక్కడ తగ్గకుండా చాలా మంచి స్కోర్ ఇచ్చాడు. దానివల్ల సినిమా మీద హైప్ మరింత భారీ స్థాయిలో పెరిగిపోయింది…సినిమా చూస్తున్నంత సేపు ఆ ఎలివేషన్స్ కి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ పడటం, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా సన్నివేశాలు ఉండటం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది…