Tollywood Heroes Challenging Roles: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తరువాత చిత్ర కథలు, ప్రేక్షకుల ఆలోచన విధానాలు మారుతున్నాయి. అందుకే టాలీవుడ్ నటీనటులు సాధారణ కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉండాలని మరియు వారి కెరీర్‌లో విభిన్న రకాల పాత్రలు చేసి ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని తాపత్రయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి పాత్రలు, సినిమాలు ఎక్కువగానే చూస్తున్న మనం. మరి అలాంటి గొప్ప ప్రయోగాలు కోసం, ఛాలెంజింగ్ రోల్స్ చేసిన ప్రస్తుత తరం హీరోల గురించి చూద్దాం
రవితేజ
చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయిన రవితేజ జర్నీ ప్రస్తుతం స్టార్ హీరో వరకు కొనసాగుతోంది. దానికి ముఖ్య కారణం ఆయన తరచుగా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘రాజా ది గ్రేట్’లో కంటి చూపు లేని పాత్ర ఆ విధంగా ఆలోచించే చేశారు. అతను అంధుడిగా నటించినప్పటికీ, నటన పరంగా సినిమా అంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. మాస్ యాక్షన్ హీరోగా, ప్రతిభ ఉన్న నటుడికి ఇది డేరింగ్ స్టెప్. ముఖ్యంగా చిత్ర దర్శకుడ, రవితేజ చీకటి ప్రపంచంలో ఎలా జీవిస్తాడో చాలా బాగా చిత్రీకరించారు. ముఖ్యంగా ఇంతటి సెన్సిటివ్ విషయానికి కామెడీ జోడించి సినిమాలో చాలావరకు మనల్ని నవ్వించడం అనేది అనిల్ రావిపూడి, రవితేజ చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో ఎమోషన్స్ కూడా చాలా చక్కగా పందాయి.
ఊపిరిలో నాగార్జున
చాలెంజింగ్ రోల్స్ చేయడంలో నాగార్జున ఎప్పుడు ముందుంటారు. అలాంటి అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ఛాలెంజింగ్ రోల్‌లో చేసిన సినిమా ఊపిరి.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ‘ఊపిరి’లో క్వాడ్రిప్లెజియా సమస్యతో బాధపడే పారిశ్రామికవేత్తగా నటించాడు. అతని పేరు విక్రమాధిత్య, అతనిని చూసుకోవడానికి కార్తీ ని అసిస్టెంట్ గా తీసుకుంటారు ఇక ఆ తరువాత, కథ వారి ఇద్దరి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా మొత్తం నాగార్జున పూర్తిగా వీల్‌చైర్‌పై కూర్చొని కనిపించాడు, కానీ, నటనపరంగా మాత్రం ఆయన్ని ఈ చిత్రంలో మెచ్చుకోకుండా ఉండలేము. అనుభవజ్ఞుడైన నటుడిగా, శారీరకంగా ఛాలెంజ్ ఉన్న పాత్రను అతడు ఒప్పుకొని చేయడం గమనర్హం.

రంగస్థలంలో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా లో పాక్షికంగా చెవుడు ఉందే పల్లెటూరి వ్యక్తిగా నటించాడు. రామ్ చరణ్ పదోవచిత్రంగా విడుదలైన ఈ సినిమా చరణ్ లోని అద్భుతమైన నటనను మనకి స్పష్టంగా చూపించండి. ఈ సినిమా కథ దర్శకత్వం చాలా బాగా కుదిరాయి, అందులో రామ్ చరణ్ నటన ఇంకా అద్భుతంగా నిలిచింది. ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ రామ్ చరణ్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు రామ్ చరణ్ చేసిన పాత్రలో ఈ సినిమాలో చేసిన చిట్టిబాబు పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.