Chalaki Chanti Comments On Jabardasth: బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కామెడీ షో జబర్ధస్త్. ఇక దీనికి పోటీగా స్టార్ మా ప్రారంభించింది బిగ్ బాస్. రెండూ వేటికవే ప్రధాన అత్యధిక రేటింగ్ ఇచ్చే కార్యక్రమాలు. అయితే బిగ్ బాస్ లోకి ప్రతీసారి ఒక జబర్ధస్త్ కమెడియన్ ను లాగేయడం పరిపాటిగా మారింది. గతంలో ముక్కు అవినాష్ ఇలానే జరబ్ధస్త్ వదిలి వస్తున్నందుకు ఏకంగా మల్లెమాలకు 10 లక్షలు కట్టి మరీ బయటకు వచ్చాడు. ఇప్పుడు చలాకీ చంటి కూడా ఇలానే వచ్చేసి బిగ్ బాస్ 6లో పాల్గొన్నట్టు తెలిసింది.

ఇక బిగ్ బాస్ లోకి వెళ్లేముందు ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు చంటి. ఈ కార్యక్రమం చంటి షోలోకి ఎంట్రీ ఇచ్చాక ప్రసారమైంది. బిగ్ బాస్ లోకి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని.. చాలా సార్లు పిలిచారని.. నాగార్జున గారితో తన పేరు వినాలనే ఆశతోనే ఈసారి వచ్చినట్టు తెలిపాడు. ప్రేక్షకులు తనను సపోర్టు చేయాలని పిలుపునిచ్చాడు.
ఇక బిగ్ బాస్ కోసం తాను జబర్ధస్త్ నుంచి బయటకు వచ్చే నేపథ్యంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చంటి తెలిపారు. మల్లెమాల వారు ఇచ్చే డబ్బులు తనకు ఏమాత్రం సరిపోవని.. అడిగితే నీ మొహానికి ఇదే ఎక్కువ అంటూ తనను దారుణంగా అవమానించారని చంటి వాపోయారు. ముక్కుసూటిగా నిలదీసే తనను కోపిష్టిగా, పొగరు, ఆటిట్యూడ్ చూపించే ఇగోయిస్ట్ గా ముద్ర వేశారని.. అందుకే ఇక జబర్ధస్త్ లో ఉండలేక మంచి ఆఫర్ ఇవ్వడంతో బిగ్ బాస్ లోకి వచ్చానని చంటి తెలిపారు.

తాను జబర్ధస్త్ ను వీడడానికి మల్లెమాలనే కారణమని ఆరోపించారు. మరి చంటి ఆరోపణలపై మల్లెమాల, బిగ్ బాస్ టీం ఎలా స్పందిస్తుందన్నది వేచిచూడాలి.