Celebrity weddings : ప్రస్తుతం చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పెద్దగా చేసుకొని ఏకంగా విడిపోతున్నారు. అర్థం చేసుకొని కూర్చుని మాట్లాడుకునే విషయాలను కూడా విడాకుల వరకు తెచ్చుకొని సంబంధాలను తెగదెంపుకుంటున్నారు. ఇక సామాన్యులు మాత్రమే కాదు. సెలబ్రెటీలు కూడా ఈ విషయంలో తగ్గడం లేదు. అభిమానులు హర్ట్ అయినా ఆస్తులు తగ్గినా, ఫేమ్ పోయినా సరే కానీ నచ్చకపోతే కలిసి ఉండలేము అంటున్నారు. ఇక కొందరు రెండు పెళ్లిల్లు మాత్రమే చేసుకుంటే మరికొందరు ఇంకో స్టెప్ వేసి మూడు నాలుగు పెళ్లిల్లు చేసుకున్నారు. మరి వారు ఎవరు అంటే?
కరణ్ సింగ్ గ్రోవర్: కరణ్ సింగ్ గ్రోవర్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఇక ఈయన హిందీ సినిమాలతో కూడా తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఇక ఈ స్టార్ హీరో మూడు సార్లు పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య శ్రద్ధా నిగమ్, రెండో భార్య జెన్నిఫర్ వింగెట్. ఈ ఇద్దరితో విడిపోయి ఏకంగా మూడో భార్య బిపాశా బసును కూడా పెళ్లి చేసుకున్నాడు.
కబీర్ బేడీ: కబీర్ బేడీ మూడు కాకుండా మరో మెట్టు ఎక్కి నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య ప్రొతిమా గౌరీ, రెండో భార్య సుసన్ హంప్రేస్ లు. అయితే వీరితో విడిపోయి మూడో భార్య నిక్కీ బేడి ని పెళ్లి చేసుకున్నారు. ఇక ఆ తర్వాత నాల్గో భార్య పర్వీన్ దుసాంజ్ బేడీ ను పెళ్లి చేసుకున్నారు.
సిద్ధార్థ్ రాయ్ కపూర్: నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ గురించి కూడా చాలా మందికి తెలుసు. ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య ఆర్తి బజాజ్, రెండో భార్య కవితలతో విడిపోయి మూడో భార్య విద్యాబాలన్ ను పెళ్లి చేసుకున్నారు.
కమల్ హాసన్: ఈ హీరో అంటే చాలా మందికి ఇష్టం. అయితే కమల్ హాసన్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాణి గణపతి కమల్ హాసన్ మొదటి భార్య. అయితే వీరిద్దరికి పుట్టిన సంతానమే శృతి హాసన్. ఇక సారిక ఠాకూర్ రెండో భార్య. గౌతమీతో సహజీవనం చేశారనే టాక్ కూడా ఉంది.
పవన్ కళ్యాణ్: ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి టాపిక్ తో చాలా మంది పవన్ కళ్యాణ్ ను చాలా సార్లు దూషిస్తూ ఉంటారు. అయితే నందిని మొదటి భార్య. రేణు దేశాయ్ రెండో భార్య. మూడవ భార్య అన్నా లెజినెవా.
సంజయ్ దత్: సంజయ్ దత్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రిచా శర్మని మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రియా పిల్లైని రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక మాన్యత దత్‌ని మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్ దత్. ఇక ఈయన నటించిన సినిమాలు ఇప్పటికి కూడా మంచి హిట్ లను అందుకుంటాయి.