Bigg Boss 9 Agnipariksha: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) లోకి సామాన్యులను పంపే ప్రక్రియ లో భాగంగా ‘అగ్నిపరీక్ష’ అనే షోని బిగ్ బాస్ యాజమాన్యం నిర్వహించిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజుల నుండి ఈ షో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కొన్ని లక్షల అప్లికేషన్స్ నుండి వివిధ రౌండ్స్ ద్వారా ఫిల్టర్ చేసి, కేవలం 15 మందిని మాత్రమే అగ్నిపరీక్ష షో కి ఎంచుకున్నారు. ఈ 15 మందిలో ప్రసన్న కుమార్, శ్వేతా శెట్టి అనే కంటెస్టెంట్స్ రీసెంట్ గానే ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు ఓటింగ్ లో అందుబాటులో ఉన్నారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు. వారిలో ముగ్గురిని నేరుగా జడ్జీలు ఎంపిక చేసి హౌస్ లోకి పంపుతారు. మిగిలిన ఇద్దరినీ ఆడియన్స్ ఓటింగ్ ద్వారా పంపుతారు.
Also Read: అక్కడ ‘ఓజీ’ రిలీజ్ లేనట్టే..పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త!
అయితే గత కొద్దిరోజులుగా మనం వింటూనే ఉన్నాం. అగ్నిపరీక్ష లోని కంటెస్టెంట్స్ ని చూసి సెలబ్రిటీ కంటెస్టెంట్స్ భయపడుతున్నారని, బిగ్ బాస్ టీం కొంతమంది సెలబ్రిటీలను సంప్రదించగా, వాళ్ళు ఈ కారణం చూపించి మేము రాలేము అని తెగేసి చెప్పారని, సామాన్యులకు అగ్ని పరీక్ష షో ద్వారా భారీ ఓటింగ్ జరిగి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడిందని, వాళ్ళని అందుకోవడం ఇప్పుడు మాకు చాలా కష్టమని సెలబ్రిటీలు బిగ్ బాస్ టీం తో చెప్తున్న మాటలు. అయినప్పటికీ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం టాప్ సెలబ్రిటీస్ ఈసారి బిగ్ బాస్ 9 లోకి వస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ముందు ఓకే చెప్పి, ఆ తర్వాత మా వాళ్ళ కాదంటూ డ్రాప్ అవుతున్నారని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం. అందులో హర్షిత్ రెడ్డి ఒకడు. ఈయన ‘శుభమ్’ సినిమాలో హీరో గా నటించాడు. ఈయన్ని సంప్రదించిన వెంటనే ఆయన అడిగిన మొట్టమొదటి ప్రశ్న ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులకు భారీ ఫ్యాన్ బేస్ వచ్చింది కదా, ఇప్పుడు హౌస్ లోకి అడుగుపెడితే మా పరిస్థితి ఏంటి?.
హౌస్ లో వంద రోజులకు పైగా ఉండాలి కాబట్టి, వాళ్ళని మేము కొన్ని సందర్భాల్లో తిట్టాల్సి వస్తుంది, అప్పుడు సామాన్యులను తిడుతున్నారు అనే ట్యాగ్ మాపై పడుతుంది, దాని నుండి ఎలా తప్పించుకుకోవాలి?, ఒకసారి అగ్నిపరీక్ష షో చూసి నా నిర్ణయం చెప్తానని అన్నాడట హర్షిత్ రెడ్డి. రీసెంట్ గానే ఆయన స్వయంగా కాల్ చేసి నేను బిగ్ బాస్ 9 కి రావడం లేదని యాజమాన్యం కి చెప్పాడట. కేవలం ఇతను మాత్రమే కాదు, స్టార్ మా ఛానల్ లో పాపులర్ సీరియల్ గుప్పెడంత మనస్సులో హీరో గా నటించిన ముఖేష్ గౌడ్ కూడా తొలుత ఈ షో లో పాల్గొనడానికి ఓకే చెప్పాడని, కానీ రీసెంట్ గా అగ్నిపరీక్ష షోని చూసి నో చెప్పాడని తెలుస్తుంది. ముఖ్యంగా వీళ్ళు దమ్ము శ్రీజా మరియు హరీష్ వంటి కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు వస్తే మా పరిస్థితి ఏంటి అని అంటున్నారట. ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ ఆ రేంజ్ లో సెలబ్రిటీలను భయపెడుతున్నారు అన్నమాట.