https://oktelugu.com/

Tollywood Celebrities Cars : టాలీవుడ్ లో ఎలక్ట్రిక్ కార్లు కలిగి ఉన్న సెలెబ్రిటీలు వీళ్ళే..! వాటి ధరలను చూస్తే మెంటలెక్కిపోతారు

ముఖ్యంగా మన టాలీవుడ్ లో 5 మంది హీరోల దగ్గర ఈ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి , వాళ్లెవరో ఒకసారి ఈ ఆర్టికల్ లో చూద్దాము .

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2023 / 10:26 PM IST
    Follow us on

    Tollywood Celebrities Cars : పర్యావరణం ని పరిరక్షించుకునేందుకు ఈమధ్య ఎలక్ట్రికల్ కార్స్ మార్కెట్ లోకి అందుబాటులో వచ్చాయి.పెట్రోల్ సహాయం లేకుండా కేవలం బ్యాటరీ ఛార్జింగ్ తో నడిచే ఈ వాహనాలను సెలెబ్రిటీలు సైతం ప్రోత్సహిస్తిన్నారు.ముఖ్యంగా మన టాలీవుడ్ లో 5 మంది హీరోల దగ్గర ఈ ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి , వాళ్లెవరో ఒకసారి ఈ ఆర్టికల్ లో చూద్దాము .

    1) మహేష్ బాబు :

    టాలీవుడ్ లో ఎలక్ట్రిక్ కార్ ని కొన్ని మొట్ట మొదటి సెలబ్రిటీ సూపర్ స్టార్ట్ మహేష్ బాబు. గత సంవత్సరం ఆయన ‘ఆడీ- ఈ ట్రాన్’ అనే ఎలక్ట్రిక్ కార్ ని 1.19 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. ఈ కార్ గ్రే కలర్ లో ఉంటుంది, ఈ కార్ బ్యాటరీ ని ఒక్క గంట ఛార్జ్ చేస్తే 20 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణం చేస్తుంది.

    2) జెనీలియా :

    ప్రముఖ హీరోయిన్ జెనీలియా రీసెంట్ గానే తన భర్త రితేష్ దేశముఖ్ పుట్టిన రోజు సందర్భంగా టెస్లా మోడల్ X SUV ఎలక్ట్రిక్ కార్ ని బహుమతిగా ఇచ్చింది.దీని విలువ సుమారుగా 55 లక్షల రూపాయిల వరకు ఉంటుందట. అంతేకాదు వినాయక చవితి సందర్భంగా ఆమె తన భర్త కి కోటి 40 లక్షల రూపాయిలు విలువ చేసే BMW ఎలక్ట్రిక్ కార్ ని కూడా బహుమతి గా ఇచ్చిందట.ప్రస్తుతం ఈమె దగ్గర రెండు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి అన్నమాట.

    3) అల్లరి నరేష్ :

    కార్ కలెక్షన్ మీద మొదటి నుండి ఎంతో ఆసక్తి ఉన్న అల్లరి నరేష్ రీసెంట్ గానే కియా కంపెనీ కి చెందిన EV6 GT ఎలక్ట్రిక్ కార్ ని కొనుగోలు చేసాడట.ఈ కారు విలువ 65 లక్షల రూపాయిల వరకు ఉంటుందని.కేవలం రిజిస్ట్రేషన్ ఖర్చులకే లక్ష రూపాయలు ఖర్చు అయ్యిందని గతం లో ఆయన చెప్పుకొచ్చాడు.

    4 ) చిరంజీవి :

    మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఉన్నంత కార్ కలెక్షన్స్ టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కి కూడా ఉండదు అని అందరూ అంటూ ఉంటారు.రోల్స్ రాయల్స్ నుండి ఆస్టన్ మార్టిన్ వరకు ఆయన దగ్గర అన్నీ మోడల్ కార్లు ఉన్నాయి. రీసెంట్ గానే ఆయన తోయాటా వెల్ ఫైర్ మినీవాన్ కార్ ని కొనుగోలు చేసాడు.ఈ కార్ ఎలక్ట్రిక్ తో నడుపుకోవచ్చు, అలాగే ఫ్యూయల్ తో కూడా నడుపుకోవచ్చు. ఈ కార్ విలువ కోటి 20 లక్షల రూపాయిల వరకు ఉంటుంది.

    5) రవితేజ :

    మాస్ మహారాజ రవితేజ కూడా రీసెంట్ గానే BYD అట్టో 3 అనే ఎలక్ట్రికల్ కార్ ని కొనుగోలు చేసాడు. ఇందుకోసం ఆయన 20 వేలు పెట్టి తనకి ఇష్టమైన నెంబర్ తో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు.