అయితే, తనకు విజయాలు రాకపోయినా ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు కేథరిన్. చక్కగా ముద్దుగా బొద్దుగా ఉండే ఈ అందాల భామ, ప్రస్తుతం అవకాశాల కోసం కుస్తీ పడుతూ.. కొత్తగా ట్రై చేస్తోంది. వరుస అవకాశాలు రావాలంటే.. ఇక అందాల కనువిందు చేయాల్సిందే అని ఫిక్స్ అయినట్టు ఉంది. గ్యాప్ లేకుండా హాట్ హాట్ ఫోటో షూట్ లతో నెటిజన్లకు హీట్ పెంచడానికి మొహమాటం లేకుండా కష్టపడుతుంది.
కానీ, ఇలా అందరి హీరోయిన్ల రూట్ లోనే ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు పెట్టడం వల్ల, అలాగే తన గ్లామర్ షోతోనైనా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తాయని ఆశపడటం వల్ల.. ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎలాగూ ఈ బ్యూటీకి వయసు కూడా ముదిరిపోయింది. మరి 30 ఏళ్ళ ఈ సుందరి, ఇప్పుడు స్టార్ డమ్ కోసం పరిధి దాటడం వల్ల కొత్తగా వచ్చేది ఏమి లేదు.
కాబట్టి, ఈ కేరళ కుట్టి నటన పై ఫోకస్ పెట్టడం బెటర్. అలాగే ఒక్క తెలుగునే నమ్ముకోకుండా.. మిగిలిన భాషల్లో కూడా అవకాశాలు కోసం ప్రయత్నాలు చేయడం ఉత్తమం. నిజానికి కొన్ని తమిళ చిత్రాల్లో కూడా కేథరిన్ నటించింది. కానీ ఎందుకో ఆమె తమిళం వైపు చూడకుండా తెలుగులోనే మరిన్ని అవకాశాల కోసం ఇక్కడే పడిగాపులు కాస్తోంది.
“ఇద్దరమ్మాయిలతో” సినిమాలో క్యాథరీన్ చూసిన సినీ విశ్లేషకులు అమ్మడులో మ్యాటర్ ఉంది, కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగులో లీడింగ్ హీరోయిన్ గా ఈ భామ స్టార్ అవ్వడం ఖాయం అని భావించారు. చివరకు విశ్లేషకుల కూడా షాక్ అయ్యేలా క్యాథరీన్ కెరీర్ సాగుతుంది. పాపం క్యాథరీన్.