Ravi Teja Mother: మాస్ మహారాజా రవితేజ తల్లిపై తూర్పుగోదావరి జిల్లా రామవరం పోలీసులు కేసు నమోదు కావడం అందర్నీ షాక్ కి గురి చేసింది. జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన ఘటనలో ఆమెతో పాటు మరొకరిపై ఈ కేసు నమోదు అయింది. సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ రవితేజ తల్లిపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు పై విచారణ జరుగుతుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే, రవితేజ ఫ్యామిలీ డబ్బు విషయంలో కాస్త సీరియస్ గా ఉంటారని టాక్ ఉంది. అందుకే, డబ్బు దగ్గర రవితేజ కూడా చాలా నిక్కచ్చిగా ఉంటారని.. మాస్ మహారాజాగా తనకు స్టార్ డమ్ వచ్చినా.. రవితేజ మాత్రం డబ్బు విషయంలో అసలు మొహమాట పడడు అట. ప్రస్తుతం డబ్బు కోసమే వరుస సినిమాలను అంగీకరిస్తూ పోతున్నాడట. ఎలాగూ వయసు కూడా పెరుగుతుంది, మహా అయితే మరో నాలుగేళ్లు మాత్రమే యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది.
అందుకే, ఈ నాలుగేళ్లలో సాధ్యమైనంత వరకు సినిమాలు చేసి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని రవితేజ ఆరాట పడుతున్నాడు. అందుకే రవితేజ భారీ రెమ్యునరేషన్ అడుగుతున్నాడు. తన పారితోషికంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. నిజానికి క్రాక్ కి ముందు వరకు రవితేజ 8 కోట్లు వరకు తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 16 కోట్లు వరకు అడుగుతున్నాడు. కారణం క్రాక్ సినిమా హిట్ అవ్వడం. మొత్తానికి ఒక్క హిట్ కే రెమ్యునరేషన్ ను డబుల్ చేయడం అనేది ఒక్క రవితేజకే చెల్లింది అనుకోవాలి.