Tollywood Star Remuneration: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో భారీ మార్పులైతే వచ్చాయి… ఒక్క సినిమా కోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ హంగులు ఆర్భాటాలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన రాబడుతున్నారు… ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజువల్ వండర్స్ ని తెరకేక్కిస్తున్న స్టార్ డైరెక్టర్లు అంతకంతకు వాళ్ళ రెమ్యునరేషన్స్ ను అలాగే సినిమా మేకింగ్ ఖర్చులను పెంచుతూ పోతున్నప్పటికి సగటు ప్రేక్షకుడు మాత్రం ఆ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అయితే ఇలాంటి క్రమంలోనే సినిమాలు సక్సెస్ అయితే పర్లేదు గాని ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం ప్రొడ్యూసర్లు భారీగా నష్టాలను చవి చూడాల్సిన పరిస్థితి అయితే రావచ్చు… అందుకే చాలామంది దర్శకులు సినిమాలను చేస్తున్నప్పుడు ఆచితూచి మరి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు… ఇక పెరుగుతున్న బడ్జెట్లను మనం కంట్రోల్ చేయలేమా అనే ఆలోచనలో ప్రొడ్యూసర్స్ ఉన్నప్పటికి దర్శకులు, హీరోలు మాత్రం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేయడం కూడా బడ్జెట్లో భాగం అవ్వడం అది విపరీతంగా పెరిగిపోవడం చకచక జరిగిపోతున్నాయి. దానివల్ల సినిమా బడ్జెట్ అనేది అంతకంతకు పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న బడ్జెట్ ను తగ్గించడానికి ఏం చేయాలి అంటే భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నప్పుడు హీరోలకు, దర్శకులకు ముందుగానే రెమ్యూనరేషన్స్ ఇవ్వకుండా సక్సెస్ లో పర్సంటేజ్ ఇస్తే దాదాపు సగం బడ్జెట్ తగ్గిపోతుందనే చెప్పాలి. ఇప్పుడు స్టార్ హీరోలందరు 100 కోట్లకు పైన రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారు. అలాగే స్టార్ డైరెక్టర్లు సైతం 80 నుంచి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తూండడం విశేషం…
Also Read: పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే ఈ నలుగురు హీరోల వల్లే అవుతుందా..?
ఇక వీళ్ళిద్దరి రెమ్యూనరేషన్స్ కలుపుకొని దాదాపు 300 కోట్ల వరకు అవుతొంది. మరి ఈ బడ్జెట్ ను మనం కంట్రోల్ చేయగలిగితే సినిమా లిమిటెడ్ బడ్జెట్ లోనే పూర్తవుతుంది. అలాగే చాలా తక్కువ బడ్జెట్ లోనే ప్రేక్షకుడికి మనం ఒక విజువల్ వండర్ ని చూపించవచ్చు అనే ధోరణిలో కూడా కొంతమంది నిర్మాతలు మాట్లాడుతున్నారు.
ఇక వీటన్నింటికి కొంతమంది హీరోలు దర్శకులు సపోర్ట్ చేస్తున్నప్పటికి ఓవరాల్ గా చాలామంది హీరోలు మాత్రం వీటి మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన సినిమాకి నష్టాలు వస్తే తమ రెమ్యూనరేషన్ కోల్పోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఒకవేళ లాభాలు వస్తే భారీగా ప్రాఫిట్స్ వచ్చినప్పటికి ఇది ఎంతవరకైనా రిస్కీ ప్రాసెస్ అనే ఉద్దేశ్యంతో హీరోలు ఉన్నారు…
Also Read: చిరంజీవి బర్త్ డే కి అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేశాడంటే..?
అంటే ప్రొడ్యూసర్స్ నష్టపోయిన పర్లేదు కానీ హీరోలు మాత్రం సేఫ్ జోన్ లో ఉండాలి అనుకోవడం చాలావరకు తప్పు అవుతుంది అంటూ సినిమా మేధావులు సైతం హీరోలకు తెలిసేలా చెబుతున్నారు. అయితే కొంతమంది హీరోలు ఇప్పటికే ప్రాఫిట్స్ లో పర్సంటేజ్ తీసుకుంటున్నారు. మరి ఈ ప్రాసెస్ లో ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…