https://oktelugu.com/

రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన రాజకీయ ప్రకటన తమిళ రాజకీయాల్లో కలకలం రేపిందనే చెప్పాలి. ఇప్పటివరకూ చిన్నాచితకా నాయకులూ కూడా రజిని పార్టీ పెట్టలేడు, ఆయన ఆరోగ్యం అందుకు సహకరించదు అని అనవసరపు కామెంట్స్ చేసి.. తమ పార్టీని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. పైగా వేరే పార్టీ అధినేతలు కూడా తమకు పోటీ లేదు అని హ్యాపీగా ఫీల్ అయినవారందరికీ ఇప్పుడు రజిని రాజకీయ ప్రకటన అందరికి పెద్ద షాక్. మొత్తానికి రజినీకాంత్ రాజకీయ ప్రవేశంతో తమిళనాడు […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 03:34 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన రాజకీయ ప్రకటన తమిళ రాజకీయాల్లో కలకలం రేపిందనే చెప్పాలి. ఇప్పటివరకూ చిన్నాచితకా నాయకులూ కూడా రజిని పార్టీ పెట్టలేడు, ఆయన ఆరోగ్యం అందుకు సహకరించదు అని అనవసరపు కామెంట్స్ చేసి.. తమ పార్టీని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. పైగా వేరే పార్టీ అధినేతలు కూడా తమకు పోటీ లేదు అని హ్యాపీగా ఫీల్ అయినవారందరికీ ఇప్పుడు రజిని రాజకీయ ప్రకటన అందరికి పెద్ద షాక్. మొత్తానికి రజినీకాంత్ రాజకీయ ప్రవేశంతో తమిళనాడు రాజకీయాలు ఇక రసవత్తరంగా మారబోతున్నాయి.

    Also Read: అభిజిత్ ను ఇంటి నుంచి పంపించేసిన బిగ్ బాస్?

    కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ల్లోనో, మే నెలల్లోనో జరుగుతాయి కాబట్టి.. ఈ లోపే అన్ని రాజకీయ పార్టీలు తమ ఎజెండాలను రెడీ చేసుకుంటూ ఆ రకంగా ముందుకు పోతున్నారు. అందుకు తగ్గట్టుగా రజిని కూడా పక్కా వ్యూహంతో రాజకీయాల్లోకి వస్తున్నాడట. అంటే ఎన్నికలకు సిక్స్ మంత్స్ టైం కూడా లేదు కాబట్టి.. రజిని ఏమి చేయలేడు అనుకోవడానికి లేదు. అయితే ఇంత తక్కువ టైంలో ఆయన పార్టీ పెట్టి విజయం సాధించగలడా? అంటే.. అసాధ్యం అని చెప్పలేము. గతంలో ఎన్టీఆర్ కి ఆ రికార్డ్ ఉంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.

    Also Read: విజయ్ సేతుపతితో అనసూయ.. వైరల్ అవుతోన్న ఫోటో !

    ఇప్పటికీ అది తిరుగులేని రికార్డుగా ఉంది. పైగా అలా ఇప్పటివరకు ఇండియాలో ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది. ఒకవేళ రజిని విజయం సాధిస్తే.. ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసినవాడు అవుతాడు. మరి, రజినీకాంత్, ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా.. చూడాలి. అయితే ఎన్టీఆర్ స్పూర్తితో మెగాస్టార్ చిరంజీవి కూడా ఎనిమిది నెలల్లోనే అధికారంలోకి రావాలని ప్రయత్నించి విఫలం అయిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చివరకు చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మరి సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయం ఎలా సాగుతోందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్